Solar Eclipse 2024 date and time in India: ఖగోళ శాస్త్రంలో సూర్యగ్రహణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. సూర్యుడు మరియు భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు ఈ సూర్యగ్రహణం ఏర్పడుతోంది. ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 08న సంభవించబోతుంది. ఈసారి ఏర్పడబోయేది సంపూర్ణ సూర్యగ్రహణం. ముఖ్యంగా ఈ గ్రహణం ఉత్తర అమెరికా ఖండంపై ఏర్పడనుంది. ఈ గ్రహణం నాలుగు సంవత్సరాలలో ఇదే మొదటిది మరియు తదుపరిది 2044 వరకు కనిపించదు.
ఇండియాలో కనిపిస్తుందా?
సూర్యగ్రహణం ఎప్పుడు అమావాస్య రోజునే ఏర్పడుతోంది. అయితే సూర్యగ్రహణానికి 12 గంటల ముందు సూతక్ కాలం ప్రారంభమవుతుంది. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు, కాబట్టి సూతక కాలం కూడా చెల్లదు. ఈ గ్రహణం ఏప్రిల్ 8న మధ్యాహ్నం 02:12 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 02:22 గంటలకు ముగుస్తుంది. అయితే దీనిని లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించవచ్చు. నాసా, యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు. సూర్యగ్రహణాన్ని ఎప్పుడు నేరుగా చూడకండి, దీని కోసం సోలార్ ఫిల్టర్లు లేదా ఎక్లిప్స్ గ్లాసెస్ ఉపయోగించండి.
ఈ పనులు చేయకండి..
గ్రహణ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో ఇంటి నుంచి బయటకు రాకూడదు. అంతేకాకుండా గ్రహాణాన్ని నేరుగా చూడకూడదని నమ్ముతారు. అంతేకాకుండా ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా కేర్ పుల్ గా ఉండాలి. గ్రహణ కాలంలో గర్భిణులు బయటకు వెళ్లకూడదు, అంతేకాకుండా షార్ప్ అయిన వస్తువులను ఉపయోగించకూడదు. ఈ టైంలో పూజలు చేయడం నిషేధం. ఆహారం కూడా తినడ కూడదని నమ్ముతారు.
Also Read: Holi Colour: హోలీ రోజు ఏ రాశి వారు ఏ కలర్ తో హోలీ ఆడాలో తెలుసా?
Also Read: Surya Gochar 2024: దాదాపు 12 ఏళ్ల తర్వాత కలవబోతున్న సూర్యుడు-గురుడు.. ఈ 3 రాశులకు జాక్ పాట్ పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి