AP Inter Results 2024: ఏపీలో ఇంటర్ పరీక్షలు మార్చ్ 1 నుంచి 18 వరకూ జరిగాయి. వొకేషనల్ ఇతర అంశాలకు సంబంధించి మొత్తం పరీక్షలు 20 తేదీకి పూర్తి కాగా 18వ తేదీ నుంచి వాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,99,698 మంది విద్యార్ధులకు ఇంటర్ పరీక్షలు రాశారు. ఇంటర్ పరీక్షలకు ఎలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారో, వాల్యుయేషన్ కూడా పగడ్బందీగా జరుగుతోంది.
ఏపీలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్ధులు 5,17,617 మంది హాజరుకాగా, రెండవ సంవత్సరం విద్యార్ధులు 5,35,056 మంది హాజరయ్యారు. రాష్ట్రంలో మార్చ్ 1 నుంచి 18 వరకూ ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. ఎక్కడా ఎలాంటి అవకతవకల్లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో పరీక్షలు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కేవలం 75 మాల్ ప్రాక్టీస్ ఘటనలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 1559 సెంటర్లలో సీసీ కెమేరాలతో పటిష్టమైన నిఘాతో పరీక్షలు జరిగాయి. పరీక్ష పత్రాలు లీక్ కాకుండా ఉండేందుకు మూడు దశల్లో ప్రశ్నాపత్రాలకు క్యూ ఆర్ కోడ్ ముద్రించారు. ప్రస్తుతం ఇంటర్ పరీక్షల మూల్యాంకనం జరుగుతోంది. ఈ ప్రక్రియ ఏప్రిల్ 4 వరకూ కొనసాగనుంది. ఆ తరువాత ఏప్రిల్ రెండో వారంలోనే అంటే మూల్యాంకనం పూర్తయిన 3-4 రోజుల్లోనే ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నారు.
Also read: IPL 2024 SRH vs KKR: క్షణాల్లో మారిన సీన్, పాపం కావ్య పాప..సోషల్ మీడియాలో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook