Aloo Bukhara fruit benefits: ఆలు బుఖారా ఒక రుచికరమైన, పోషకమైన పండు. దీనిని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇది ఎరుపు-నీలం రంగులో కనిపిస్తుంది. రెయినీ సీజన్‌లో మాత్రమే ఈ పండ్లు మనకు లభిస్తాయి. దీని రుచి తియ్యగా ఉంటుంది.
ఈ ఆలు బుఖారాలో అనేక రకమైన పోషకాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా పొటాషియం అధికంగా ఉంటుంది. దీని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని రక్షిస్తుంది.కేలరీలు తక్కువగా ఉండటం వలన డయాబెటిస్ ఉన్నవారికి కూడా మంచిది.
ఆలు బుఖారా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1. గుండె ఆరోగ్యానికి మంచిది:
* ఆల్ బుఖారా పండ్లలో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. దీని వలన గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి.
* గుండె ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి.
2. జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది:
* ఆల్ బుఖారా పండ్లలో ఉండే సార్బిటాల్ మలబద్ధకాన్ని నివారిస్తుంది.
* ఇసాటిన్ జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది.
3. క్యాన్సర్ నివారణ:
* ఆల్ బుఖారా పండ్లలోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలతో పోరాడతాయి.
* స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ , శ్వాసకోశ సంబంధిత క్యాన్సర్ రాకుండా కాపాడతాయి.
4. రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది:
* ఆల్ బుఖారా పండ్లలో ఉండే ఐరన్ రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
5. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది:
* ఆల్ బుఖారా పండ్లలో అధికంగా ఉండే ఫైబర్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.
* కాలేయంలో కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుంది.
6. ఎముకల ఆరోగ్యానికి మంచిది:
* ఆల్ బుఖారా పండ్లలో ఉండే బోరాన్ ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
7. రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
* ఆల్ బుఖారా పండ్లలో పుష్కలంగా ఉండే విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
* ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.
8. కంటి ఆరోగ్యానికి మంచిది:
* ఆల్ బుఖారా పండ్లలో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ లు ఎక్కువగా ఉంటాయి.
* కంటి చూపు సమస్యలను నివారిస్తాయి.
9. షుగర్ నియంత్రణ:
* ఆల్ బుఖారా పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది.
* షుగర్ వ్యాధి ఉన్నవారికి మంచిది.
10. చర్మ సౌందర్యానికి మంచిది:
* ఆల్ బుఖారా పండ్లను తినడం వల్ల ముడతలు తగ్గుతాయి.
* చర్మం కాంతవంతంగా మారుతుంది.
* మచ్చలు కూడా పోతాయి.
సైడ్ ఎఫెక్ట్స్:
* ఎక్కువగా తినడం వల్ల కిడ్నీ లో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంది.
* అలర్జీలు వచ్చే అవకాశం ఉంది.
* కడుపులో పుండ్లు అయ్యే అవకాశం ఉంది.
Also read: Diarrhea After Eating Bananas: అరటిపండ్లు తిన్న వెంటనే మలవిసర్జన..కారణాలు ఇవే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Aloo Bukhara Fruit: ఆలు బుఖార పండ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!