Gac Fruit: గ్యాక్‌ ఫ్రూట్‌ తినడం వల్ల కలిగే ఉపయోగాలు

Gac Fruit Benefits: గ్యాక్ ఫ్రూట్  తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. దీని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. అంతేకాకుండా  ఇందులో అనేక రకమైన పోషకాలు పుష్కలంగా దొరుకుతాయి. 

  • Mar 14, 2024, 16:56 PM IST


Gac Fruit Benefits: గ్యాక్ ఫ్రూట్ ని  అడవి కాకర అని కూడా పిలుస్తారు. ఇది ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలకు చెందిన పండు.  దాని ప్రత్యేకమైన నారింజ-ఎరుపు రంగుకు పేరుగాంచింది. ఇది బీటా-కెరోటిన్ లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. గ్యాక్ ఫ్రూట్ శాస్త్రీయంగా Momordica Cochinchinensis అని పిలుస్తారు. పుచ్చకాయ,  దోసకాయ కుటుంబానికి చెందినది.గ్యాక్ ఫ్రూట్ పండు  బంతి ఆకారంలో ఉండి ఒక్కొక్కటి కేజీ బరువు వరకు ఉంటుంది. 

1 /5

 గ్యాక్‌ ఫ్రూట్‌  విటమిన్ ఎ, సి, ఇ, బి6, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలకు  లభిస్తాయి.

2 /5

ఇది యాంటీఆక్సిడెంట్లకు గొప్ప మూలం, ముఖ్యంగా లైకోపీన్, ఇది కణాలను దెబ్బతిన్న కణాల నుంచి రక్షించడానికి సహాయపడుతుంది.  

3 /5

గ్యాక్‌ ఫ్రూట్‌  లోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల ఏర్పాటును నిరోధించడంలో సహాయపడతాయి.  

4 /5

గ్యాక్‌ ఫ్రూట్‌  లోని లైకోపీన్ కంటి ఆరోగ్యానికి మంచిది. వయస్సు-సంబంధిత మాక్యులా డీజెనరేషన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

5 /5

గ్యాక్‌ ఫ్రూట్‌  పురుషులలో ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.