Assault: ఆమె కోడలా నరరూప రాక్షసా.. మామపై విచక్షణా రహితంగా దాడి వీడియో వైరల్‌

Woman Assault Father In Law: తండ్రిలాంటి మామపై కరుణ లేకుండా కోడలు విచక్షణా రహితండా దాడికి పాల్పడింది. కర్రతో ఆమెను వృద్ధుడైన మామపై దాడి చేస్తున్న వీడియో దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఫలితంగా ఆమె జైలు పాలయ్యింది. మామ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 12, 2024, 12:34 PM IST
Assault: ఆమె కోడలా నరరూప రాక్షసా.. మామపై విచక్షణా రహితంగా దాడి వీడియో వైరల్‌

Mangaluru Police: నేటి తరం మహిళలు వృద్ధులపై కనికరం చూడడం లేదు. ముఖ్యంగా అత్తామామలపై కర్కశత్వం ప్రదర్శిస్తున్నారు. ఇటీవల కేరళలో ఓ మహిళ అత్తపై దారుణంగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో చోట ఓ కోడలు మామపై విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. చేతికర్రను తీసుకుని మామపై దాడికి పాల్పడడమే కాకుండా తోసేయడంతో పెద్దాయన సోఫాపై పడిపోయాడు. ఈ దారుణ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కోడలి తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటుచేసుకుంది.

Also Read: Sad Incident: మహా శివరాత్రి రోజు కలచివేసే ఘటన.. చిన్నారి ప్రాణాలు బలిగొన్న 'కుట్టు మిషన్‌'

మంగళూరులోని కుల్‌శేఖర్‌ ప్రాంతంలో పద్మనాభ సువర్ణ (87)  కుటుంబంతో సహా నివసిస్తున్నాడు. ఆయనకు ఉమా శంకరి అనే కోడలు ఉంది. ఆమె అట్టవార్‌లోని ఎలక్ట్రిసిటీ ప్రొవైర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా ఆమె భర్త ప్రీతమ్‌ గల్ఫ్‌ దేశంలో పనిచేస్తున్నాడు. అయితే తరచూ మామను ఆమె సూటిపోటి మాటలతో హింసించేది. ఈనెల 9వ తేదీన ఏం జరిగిందో తెలియదు కానీ ఆమె మామపై దారుణంగా ప్రవర్తించింది.

చేతికర్ర తీసుకుని దాడికి పాల్పడింది. కర్రతో దాడి చేయగా వద్దని వారించాడు. ఆమెను ఆపుతుండగా ఒక్క తోపు తోసింది. దీంతో మామ సోఫా దగ్గరకు వచ్చి పడ్డాడు. ఇది గల్ఫ్‌లో ఉన్న భర్త ప్రీతమ్‌ సీసీ కెమెరాలో చూసి వెంటనే స్థానికంగా ఉంటున్న తన సోదరి ప్రియకి విషయం చెప్పాడు. ఆమె వెంటనే ఇంటికి చేరుకుని గాయపడిన తండ్రి పద్మనాభ సువర్ణను లేపి ఆస్పత్రికి తరలించింది. అనంతరం తన వదినపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

Also Read: Woman Killed: ఆస్ట్రేలియాలో తెలంగాణ మహిళ దారుణ హత్య.. సంచలనం రేపుతున్న భర్త వ్యవహారం

 

డలుపై కేసు నమోదు చేసుకున్న కంకనాడీ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గాయాలపాలైన వృద్ధుడిని సమీపంలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. సీసీ ఫుటేజీ చూసిన నెటిజన్లు విస్తుపోయారు. కోడళ్లు ఇలా ఉంటారా? అని ప్రశ్నిస్తున్నారు. భర్త కుటుంబసభ్యులపై ఎందుకింత కోపం అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మహిళల వలనే ఉమ్మడి కుటుంబాలు ఉండడం లేదని వాపోయారు. ఉమాశంకరి కోడళ్లను భరించలేక వృద్ధులు వృద్ధాశ్రమాలకు వెళ్తున్నారు అని చెబుతున్నారు. అయితే విదేశాల్లో ఉండీ కాకుండా ఇంట్లో ఉండి తండ్రిని చక్కగా చూసుకోవాల్సిన కొడుకుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

 

Trending News