Five Killed and 10 Injured in Gaza Aid Drop Tragedy: ఇజ్రాయెల్, గాజా ల మధ్య యుధ్దం పీక్స్ కు చేరింది. గాజాలోని ప్రజలు కనీసం తినడానికి తిండిలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న పిల్లలు కనీసం, కడుపు నిండా తిండి దొరక్క అల్లాడిపోతున్నారు. అక్కడి ప్రజలు ఆహార పదార్థాలు అస్సలు దొరకడం తీవ్ర గగనమైపోయింది. ఇటీవల ఒక ఒక స్వచ్చందసంస్థ హమాస్ ప్రజలకు ఆహారం పోట్లాలు ఇవ్వడానికి వచ్చింది. ఈక్రమంలో ఫుడ్ కోసం ప్రజలు ఒక ప్రదేశంలో గుమిగూడారు. దీంతో ఇజ్రాయెల్ ప్రజలు ఒక్కసారిగా ఇష్టమున్నట్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. భారత్ తోపాటు, అమెరికాలో కూడా గాజాకు తమ వంతుగా ఆహారం, మెడిసిన్ సహాయం అందించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అనేక దేశాలు పారాచూట్ సహాయంతో ఆహారం,ఇతర పదార్థాలు గాజాకు తరలిస్తున్నాయి.
Read More: Indigestion Remedies: తిన్న ఆహారం జీర్ణమవ్వట్లేదా.. అయితే ఇవి ట్రై చేయండి!
ఇదిలా ఉండగా.. ఆహారం అందిస్తుండగా ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలో.. గాజాలో పారాచూట్ లో ఆహారం పంపిణి చేశారు. దీని కోసం అక్కడి ప్రజలు ఎంతో ఆకలితో పారాచూట్ వైపుకు చూస్తున్నారు. ఏమైందో ఏమో.. కానీ ఒక్కసారిగా పారాచూట్ తెరుచుకోకుండానే అది అక్కడి ప్రజలపై పడింది. దాని బరువుకు అక్కడున్న ప్రజలు ఒక్కసారిగా దాని కింద ఇరుక్కుపోయారు. ఈ ఘటనలో అక్కడ ఊపిరిఆడక..ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. అదే విధంగా.. మరో పది మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. పారాచూట్ తెరుచుకోక పోవడం వల్లన ఈ దుర్ఘటన సంభవించినట్లు సమాచారం.
పారాచూట్ అక్కడి పాలస్తీనా భూభాగం యొక్క ఉత్తరాన ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర విషాదంగా మారింది. పారాచూట్ ను చూడగానే ఏదో ఆహారం తమ కోసం వచ్చిందని అక్కడి వారు వెళ్లారు. ఒక్కసారిగా పారాచూట్ మాత్రం బలంగా వారిమీద పడటంతో అక్కడి వారు మరణించారు. ఐదు నెలలకు పైగా ఇజ్రాయెల్, గాజాల మధ్య భయంకరమైన యుద్ధం నడుస్తోంది. దీని వల్ల లక్షలాది మంది ప్రజలు భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
Read More: Krithi Shetty: బేబమ్మ అందాలకు బౌల్డ్ అవుతున్న కుర్రోళ్లు.. లేటెస్ట్ ఫోటోస్ అదుర్స్..
ఉత్తర గాజాలో ఎయిర్‌డ్రాప్‌లను నిర్వహించిన దేశాలలో యునైటెడ్ స్టేట్స్, జోర్డాన్ ఉన్నాయి. శుక్రవారం గాజాలో ఎయిర్‌డ్రాప్ సమయంలో సహాయంతో ఉన్న కొన్ని పారాచూట్‌లు తెరుచుకోకుండా, అకాస్మాత్తుగా నేలపై పడటానికి కారణమైన సాంకేతిక లోపం ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు. ఐదు ఇతర దేశాల భాగస్వామ్యంతో ఎయిర్‌డ్రాప్‌ను నిర్వహించిన నాలుగు జోర్డాన్ విమానాలు ఎటువంటి అవాంతరాలు లేకుండా తన మిషన్‌ను నిర్వహించాయి.కాగా దీనిపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. ల్యాండ్ డెలివరీలకు ఎయిర్‌డ్రాప్‌లు లేదా ప్రతిపాదిత సముద్ర సహాయ కారిడార్ ప్రత్యామ్నాయం కాదని యూఎన్ఓ పేర్కొంది. అదే విధంగా... మరిన్ని సరిహద్దు క్రాసింగ్‌ల ద్వారా గాజా చేరుకోవడానికి మరిన్ని ట్రక్కులను అనుమతించాలని యూఎన్ఓ ఒక ప్రకటనలో కోరింది. ఇప్పటికైన ఇజ్రాయెల్ లు,గాజాలు చర్చలతో తమ సమస్యలను పరిష్కరించుకోవాలని యూఎన్ఓ అభిప్రాయపడింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Israel-Hamas War: కొంప ముంచిన సాయం.. గాజాలో ఆహార ప్యాకెట్ల పారాచూట్ కూలీ ఐదుగురు అమాయకులు బలి..
పారాచూట్ కూలీ అమాయకులు బలి..
ఆహారం కోసం చూస్తుండగా విషాదకర ఘటన