Noodles Masala: 2 మినెట్స్‌లో నూడుల్స్‌ మసాలా తయారు చేసుకోండి ఇలా !

 మన తరుచుగా ఇంట్లోనే నూడుల్స్‌ చేసుకుంటాము. అయితే ఈ నూడుల్స్‌లోనే మనకు మసాలా పౌడర్‌ కూడా ఉంటుంది. దీనిని ఉపయోగించడం వల్ల నూడుల్స్‌ అనేది ఎంతో రుచికరంగా తయారు అవుతుంది. అయితే ఇలా ప్రాసెస్ చేయబడింది పౌడర్‌ తినడం వల్ల ఆరోగ్యాని హాని కలుగుతుందని ఆరోగ్యనిపుణులు భావిస్తున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 1, 2024, 10:55 PM IST
Noodles Masala: 2 మినెట్స్‌లో నూడుల్స్‌ మసాలా తయారు చేసుకోండి ఇలా !

Noodles Masala Powder Recipe: మన తరుచుగా ఇంట్లోనే నూడుల్స్‌ చేసుకుంటాము. అయితే ఈ నూడుల్స్‌లోనే మనకు మసాలా పౌడర్‌ కూడా ఉంటుంది. దీనిని ఉపయోగించడం వల్ల నూడుల్స్‌ అనేది ఎంతో రుచికరంగా తయారు అవుతుంది. అయితే ఇలా ప్రాసెస్ చేయబడింది పౌడర్‌ తినడం వల్ల ఆరోగ్యాని హాని కలుగుతుందని ఆరోగ్యనిపుణులు భావిస్తున్నారు.  

అయితే ఎంతో సులువుగా మనమే ఇంట్లో ఈ నూడుల్స్‌ పౌడర్‌ను తయారు చేసుకోవచ్చు. ఎలాంటి రంగులు, పొడులు కలుపుకోకుండానే సహజంగా ఈ నూడుల్స్‌ పొడిని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అయితే దీని కోసం మీరు ఇంట్లో ఉపయోగించే వస్తువులను వాడుతే సరిపోతుంది. ఇది కేవలం రెండు నిమిషాల్లో జరిగే పని. 

నూడుల్స్ మసాలాకి కావాల్సిన పదార్థాలు:

 ధనియాలు-2 టీస్పూన్లు

 జీలకర్ర-1 టీస్పూన్

గరం మసాలా-1 టీస్పూన్ 

 పసుపు-¼ టీస్పూన్

కారం పొడి- 1 టీస్పూన్ 

వెల్లుల్లి రెబ్బలు- 2 

 అల్లం-½ అంగుళం

ఎండు ఉల్లిపాయలు - 2

ఆమ్చూర్- 1 టీస్పూన్ 

మిరియాల పొడి- టీస్పూన్

 చక్కెర- 1 టీస్పూన్ పొడి

 ఉప్పు- ½ టీస్పూన్

మొక్కజొన్న పిండి- 1 టీస్పూన్ 

నూడుల్స్ మసాలా తయారు చేసుకోవడం ఎలా: 

ముందుగా ఒక గిన్నెలో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, అల్లం,  ఉల్లి తరుగు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాని మిక్సీ పట్టుకొండి. ఇలా చేస్తే  ప్రిజర్విటివ్స్ తక్కువగా ఉంటాయి. ఇందులో  టీస్పూన్ గరం మసాలా, ¼ టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ ఆమ్చూర్, ¼ టీస్పూన్ మిరియాల పొడి, 1 టీస్పూన్ పొడి చక్కెర, ½ టీస్పూన్ ఉప్పు,  1 టీస్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా ఈజీగా నూడిల్స్ కు పట్టి ఉంచుతుంది. మీరు కావాలనుకున్న నూడిల్స్ మసాలా ఈజీగా రెడీ అయ్యింది.  నూడుల్స్‌ని మరింత రుచికరంగా  ఆస్వాదించు. బయట పొడి కన్నా ఈ పొడి ఎంతో ఆరోగ్యకరంగా అలాగే రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని.

Also Read: Rooh Afza Recipe: వేడి వేసవికి చల్లని ఊరటని ఇచ్చే రూహ్ అఫ్జా షర్బత్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News