Chekodi Recipe: బియ్యం పిండి కరకరలాడే చేగోడీలను ఇలా సులభంగా తయారు చేసుకోండి..

How To Make Chekodi Recipe: సాయంత్రం స్నాక్స్‌లో భాగంగా క్రమం తప్పకుండా చేగోడీలను తీసుకోవడం తెలంగాణలో ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది. అయితే చాలామందికి దీనిని తయారు చేసుకోవడం తెలియదు. తెలియని వారికోసం మేము ఈరోజు సులభమైన పద్ధతిలో చేగోడీ తయారీ విధానం అందించబోతున్నాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 28, 2024, 10:01 PM IST
Chekodi Recipe: బియ్యం పిండి కరకరలాడే చేగోడీలను ఇలా సులభంగా తయారు చేసుకోండి..

How To Make Chekodi Recipe: సాయంత్రమైందంటే చాలు ప్రతి ఒక్కరు ఏదో ఒక స్నాక్స్ ఐటమ్ తింటూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలయితే బయట లభించే అనేక రకాల అనారోగ్యకరమైన స్నాక్స్ తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల చిన్న వయసులోనే అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. కాబట్టి బయట లభించే వాటికంటే ఇంట్లోనే ఫ్రెష్ గా తయారు చేసుకొని తీసుకోవడం చాలా మంచిది. ఇంట్లో హెల్తీగా తయారుచేసుకుని తినడానికి అనేక రెసిపీలు ఉన్నాయి. అందులో సులభంగా తయారు చేసుకునే బియ్యప్పిండి చేగోడీల రెసిపీని ఈరోజు పరిచయం చేయబోతున్నాం. దీనిని తయారు చేసుకోవడం ఎంతో సులభం. చేగోడీలు తయారు చేయడం తెలియని వారు కూడా ఇలా సులభంగా తయారు చేస్తారు. అయితే వీటిని సులభమైన పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కరకరలాడే చేగోడీలు కావలసిన పదార్థాలు:
❁ 1 కప్పు బియ్యం పిండి
❁ 1/4 కప్పు శనగపప్పు పిండి
❁ 1 టీస్పూన్ జీలకర్ర పొడి 
❁ 1/2 టీస్పూన్ మిరియాల పొడి 
❁ 1/4 టీస్పూన్ పసుపు 
❁  కొద్దిపాటి ఉప్పు
❁ నూనె 

తయారీ విధానం: 
❁ ఒక గిన్నెలో బియ్యం పిండి, శనగపప్పు పిండి, ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకోవాల్సి ఉంటుంది అందులో జీలకర్ర పొడి, మిరియాల పొడి, పసుపు, ఉప్పు వేసి కలపండి. 
❁ ఈ పొడి పదార్థాలను బాగా పిసికి మధ్య మధ్యలో నూనె వేస్తూ కలపాల్సి ఉంటుంది.
❁ కొద్దిగా కొద్దిగా నీళ్ళు పోస్తూ, మృదువైన పిండి కలుపుకోండి. పిండి చాలా గట్టిగా లేదా పలుచగా ఉండకుండా జాగ్రత్త వహించండి. గట్టిగా ఉంటే, చేగోడీలు వేయడం కష్టంగా ఉంటుంది. పలుచగా ఉంటే, అవి ఆకృతిని నిలపెట్టుకోవు.
❁ బాగా కలుపుకున్న పిండిని 10 నిమిషాలు పక్కన పెట్టండి. తప్పకుండా ఇంటికి కొద్దిసేపు రెస్ట్ ఇవ్వాలి లేకపోతే సరైన టేస్ట్ రాకపోవచ్చు.
❁ అంతేకాకుండా క్రిందిని పది నిమిషాల పాటు పక్కన పెట్టడం వల్ల పిండి మరింత మృదువుగా మారుతుంది.. చేగోడీలు మరింత కరకరలాడతాయి.
❁  చేగోడీల కోసం చేతికు అంటుకోకుండా ఉండేటట్లు నూనె వేడి చేయండి. నూనె సరైన ఉష్ణోగ్రతకు చేరుకుందో లేదో తెలుసుకోవడానికి, చిన్న ముక్క పిండిని నూనెలో వేసి చూడండి. ముక్క వేగంగా పైకి వస్తే, నూనె వేడికి సిద్ధంగా ఉన్నట్లు అర్థం.
❁  ఆ తర్వాత ఇలా కాగిన నూనెలో ముందుగానే చేగోడీ ఆకారంలో తయారు చేసి పెట్టుకున్న ఒక్కొక్క దాన్ని నూనెలో వేస్తూ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించాల్సి ఉంటుంది. అంతే సులభంగా కరకరలాడే చేగోడీ రెడీ అయినట్లే.

ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News