Venomous Snakes: పాములు సాధారణంగా అనుకోకుండా మనుషులకు ఎదురౌతుంటాయి. చెట్లు దట్టంగా, వెలుతురు లేని ప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయి. ఎలుకలు ఉన్న చోట పాముల కదలికలు ఎక్కువగా ఉంటాయి.
కొన్నిసందర్భాలలో పాములు మనుషులను కాటేస్తుంటాయి. అయితే.. పాములు కాటు వేసే ముందు కొన్నిరకాల సిగ్నల్స్ ఇస్తాయమంట. మనం నడిచేటప్పుడు కంపానాలు వస్తాయి. ఆ తరంగాలు పాముల శరీరంను తాకుతాయి..
వెంటనే పాములు అక్కడి నుంచి వెళ్లిపోతాయంటారు. కానీ పాములు కొన్ని సందర్బాలలో మనుషులకు ఎదురైనప్పుడు.. మొదట కోపంగా పడగ విప్పి... బుస్... బుస్.. అంటూ దూరంగా వెళ్లిపోమ్మన్నట్లు సిగ్నల్ ఇస్తాయంట..
పాములు, గోధుమ, నలుపు, బూడిద రంగులలో ఉంటాయి. పాములలో రాటిల్ స్నేక్ కాటేసే ముందు శబ్దం చేస్తుందంటారు. అది తన ఎరను శబ్దం చేస్తూ దాని చూపు వేరేదానిపై ఉండేలా చేస్తుంది. ఇలా ఎలుకలను వేటాడుతుంది.
కట్లపాములు మాత్రం.. మనుషులను కానీ, తనకు హనీ అన్పించగానే వెంటనే కాటు వేస్తుందని చెబుతుంటారు. నాగుపాములు, రక్తపింజర, బ్లాక్ మాంబాలు కూడా కాటేసే ముందు ఎదుటివారిని భయపెడుతాయంట..
బ్లాక్ మాంబ కూడా పడగ విప్పుకుని నాలుగ బైటకు తీసి బుస్ .. బుస్ అంటూ ఎదుటి వారిని భయపెడుతుందంట. ఆ గ్యాప్ లో మనిషిగానీ, జంతువు గానీ అలర్ట్ అయితే మాత్రం పాముల కాటుల నుంచి బైటపడోచ్చు.
పాములు కాటు వేయగానే వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. పాము కాటుకు గురైన వ్యక్తి శరీరం ఎక్కువగా కదిలే విధంగా చేయోద్దు. ఇలా చేస్తే రక్త ప్రసరణ వేగంగా జరిగి, విషం శరీరంలోకి వెళ్లిపోతుంది. రక్త ప్రసరణలో ఆటంకం కల్గజేస్తుంది. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)