Upcoming Smartphones in March 2024 In Telugu: మార్చి నెలలో అనే స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు కొత్త మొబైల్స్‌ను విడుదల చేయబోతున్నాయి. ఇప్పటికే కొన్ని టెక్ కంపెనీలు స్మార్ట్‌ఫోన్స్ లాంచింగ్ తేదిలతో పాటు స్పెషిఫికేషన్స్, ఫీచర్స్‌ను కూడా ప్రకటించాయి. అయితే అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ కలిగిన స్మార్ట్‌ఫోన్స్‌ను కొనుగోలు చేయాలనుకుంటే మార్చి నెల చివరి వారం వరకు ఆగాల్సి ఉంటుంది. చివరి వారంలో సాంసంగ్, రెడ్ మీ వంటి కొన్ని బ్రాండ్‌కి సంబంధించిన మొబైల్స్ కూడా లాంచ్ కాబోతున్నాయి. మార్చి 2024లో విడుదలయ్యే కొన్ని టాప్ స్మార్ట్‌ఫోన్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Realme 12+:
రియల్ మీ కంపెనీ Realme 12+ స్మార్ట్‌ఫోన్‌ను మార్చి 6వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. ఈ మొబైల్ 6.5 అంగుళాల 120Hz AMOLED డిస్ల్పేను కలిగి ఉంటుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 ప్రొసెసర్‌పై పని చేస్తుంది. బ్యాక్ సెటప్‌లో 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెట్‌ను కలిగి ఉంటుంది.
Samsung Galaxy F15 5G:
ఈ స్మార్ట్‌ఫోన్ మార్చి 4వ తేదీన లాంచ్ కాబోతోంది. Samsung Galaxy F15 5G మొబైల్ 6.6 అంగుళాల డిస్ల్పేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది 5G కనెక్టివిటీతో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ఈ మొబైల్ ఆక్టా-కోర్ ప్రొసెసర్‌పై పని చేస్తుంది. అలాగే 64MP ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో అందుబాటులోకి రాబోతోంది.
Xiaomi 14:
Xiaomi 14 స్మార్ట్‌ఫోన్‌ను రెడ్మీ కంపెనీ మార్చి 10వ తేదీన విడుదల చేయబోతోంది. ఇది 6.73 అంగుళాల OLED డిస్ల్పేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రొసెసర్‌పై పని చేస్తుంది. అలాగే 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో అందుబాటులోకి రాబోతోంది.
Vivo V30:
ఈ Vivo V30 స్మార్ట్‌ఫోన్ మార్చి 20వ తేదీన లాంచ్ కాబోతోంది. ఈ మొబైల్ 6.44 అంగుళాల AMOLED డిస్ల్పేతో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఈ మొబైల్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రొసెసర్ పని చేయబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ మొబైల్ 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో అందుబాటులోకి రానుంది.
Also Read Ibomma Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్లోడ్ చేయడం ఎలా?
Oppo F25:
ప్రముఖ టెక్ కంపెనీ ఒప్పో Oppo F25 మొబైల్‌ను మార్చి 25వ తేదీన విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.43 అంగుళాల AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది స్నాప్‌డ్రాగన్ 695 5G ప్రొసెసర్‌పై పని చేస్తుంది. దీంతో పాటు 64MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read Ibomma Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter