Trigrahi Yog 2024: ఈ రాశులవారిపై త్రిగ్రాహి యోగం ఎఫెక్ట్‌..మార్చి నెలలో జరగబోయే 100 శాతం ఇదే!

Trigrahi Yog 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో శక్తివంతమైన త్రిగ్రాహి యోగం ఏర్పడింది. ఈ యోగం కారణంగా కొన్ని రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 22, 2024, 10:59 AM IST
Trigrahi Yog 2024: ఈ రాశులవారిపై త్రిగ్రాహి యోగం ఎఫెక్ట్‌..మార్చి నెలలో జరగబోయే 100 శాతం ఇదే!

 

Trigrahi Yog 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక నిర్దిష్ట సమయంలోనే గ్రహాలు సంచారం చేస్తాయి. ఒక రాశిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ పరిమాణంలో గ్రహాలు కలిసినప్పుడు శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. అయితే ఇటీవలే బుధుడు కుంభరాశిలోకి సంచారంచ చేశాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..ప్రసంగం, కమ్యూనికేషన్, తెలివితేటలు, ఆర్థిక, వ్యాపారానికి కారకంగా సూచిగా భావించే బుధుడు కుంభ రాశిలోకి సంచారం చేయడంతో త్రిగ్రాహి యోగం ఏర్పడింది. ఇప్పటికే కుంభ రాశిలో శని, సూర్య గ్రహాలు సంచార దశలో ఉన్నాయి. బుధ గ్రహం సంచారం చేయడంతో ఈ ప్రత్యేక యోగం ఏర్పడింది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

మేషరాశి:
మేషరాశి వారికి 6వ స్థానికి అధిపతిగా  బుధుడు 11వ స్థానంలో సంచారం చేశాడు. దీని కారణంగా వీరికి వృత్తి పరంగా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్‌ కూడా లభించే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఆర్థిక సమస్యల నుంచి కూడా సులభంగా విముక్తి లభిస్తుంది. దీంతో పాటు పూర్వీకుల ఆస్తులు కూడా పొందుతారు. అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుటుంది. అంతేకాకుండా జలుబు, దగ్గు, కాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. 

వృషభ రాశి:
వృషభ రాశికి 10వ స్థానంలో బుధుడు సంచారం చేశాడు. కాబట్టి వీరికి ఆదాయం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. వ్యాపరాలు చేసేవారు లాభాలతో పాటు కీర్తి పొందుతారు. అంతేకాకుండా వ్యాపారాలు విస్తరించే ఛాన్స్‌ కూడా ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. 

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

 సింహరాశి:
 సింహరాశికి 7వ స్థానంలో ఈ సంచారం జరిగింది. దీని కారణంగా ఉద్యోగంలో సీనియర్ల నుంచి సపోర్ట్‌ లభించి ప్రమోషన్స్‌ కూడా పొందుతారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా పురోగతి లభించే ఛాన్స్‌ కూడా ఉంది. షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల ఆశించని లాభాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ప్రేమ జీవితం గడుపుతున్నవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. 

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News