Pesarattu: బ్రేక్‌ ఫాస్ట్‌లో దీని తీసుకుంటే మళ్ళీ మళ్ళీ తినాలి అంటారు!

Pesarattu Recipe: పెసరట్టు తెలుగు వారి ఇంట్లో చేసే ఒక రుచికరమైన వంటకం. దీని ఆంధ్ర ఎక్కువగా బ్రేక్‌ ఫాస్ట్‌కు తయారు చేసుకుంటారు. దీని తయారు చేసుకోవడం చాలా సులభం. దీని మీరు కూడా తయారు చేసుకొని తినవచ్చు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 17, 2024, 08:53 PM IST
Pesarattu: బ్రేక్‌ ఫాస్ట్‌లో దీని తీసుకుంటే మళ్ళీ మళ్ళీ తినాలి అంటారు!

Pesarattu Recipe: వేడి వేడి పెసరట్టు దీంతో పాటు అల్లం పచ్చడి కలిపి తింటే ఆహా ని ప్రతి ఒక్కరు చెప్పల్సిందే. అయితే పెసరట్టును పచ్చి శెనలు, మాసాలా దినుసలను ఉపయోగించి తయారు చేస్తారు. దీనిలో ప్రోటిన్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీని బ్రేక్‌ ఫాస్ట్‌గా చాలా మంది తింటారు. ముఖ్యంగా  ఈ పెసరెట్టును హోటల్స్ , ఆంధ్రా రెస్టారెంట్లలో రవ్వ ఉప్మాతో పాటు అల్లం చట్నీతో వడ్డిస్తారు .

పెసరట్టు పదం అనేది రెండు తెలుగు పదాల పదం. పెసర అనేది పచ్చి పప్పుకు పెరు. అట్టు అనేది దోస అని పిలుస్తారు. దీని వల్ల ఇది పెసరట్టుగా పిలువబడుతుంది. అయితే దీని తయారు చేసుకోవడం చాలా సులభం. దీని కోసం మీరు ఇంట్లో లభించే కొన్ని పదార్థాలు తీసుకుంటే సరిపోతుంది. దీని కోసం మీరు ఎక్కువగా వస్తువులు తీసుకోవడం అవసరం లేదు. మీరు ఎక్కువ సమయం కూడా తీసుకోవాల్సిన పనిలేదు. ఐదు నిమిషాల్లో దీని మీరు తయారు చేసుకొని తింటే మళ్లీ మళ్లీ తినాలి అని అంటారు. ఆ పెసరట్టును ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. 

పెసరట్టుకి కావాల్సిన పదార్థాలు: 

పెసలు ఒక కప్పు, కప్పు బియ్యం, ఉప్పు, 

పచ్చిమిరపకాయలు, మూడు టీ స్పూన్ల జీలకర్ర, 

అల్లం ముక్కలు, పెద్ద ఉల్లిపాయలు, నూనె.

పెసరట్టు తయారు చేసుకోవడం ఎలా:

ముందుగా పెసలు బియ్యం నీళ్ళు పోసి నానబెట్టాలి. శుభ్రముగా కడిగి రెండూ కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఇష్టమయిన వారు అల్లం, మిర్చి కూడా పెసలలో కలిపి రుబ్బుకోవచ్చు. లేకపోతే ఉల్లిపాయ, అల్లం, మిర్చి సన్నగా ముక్కలు కోసుకుని జీలకర్ర కొంచెం ఉప్పు కలిపి ప్రక్కన పెట్టుకోవలయును. పొయ్యి మీద పెనం పెట్టి నూనె రాచి ఈ పిండిని గరిట జారుగా చేసి గరిటతో పెనం మీద వేసి పల్చగా తిప్పి కలిపి పెట్టిన ఉల్లి ముక్కలు దీని మీద చల్లవలెను. అడుగున ఎర్రగా కాలిన తరువాత అట్టు సగానికి మడత పెట్టవలెను. తరువాత తిరగ వేసి కాలిస్తే ఉల్లి ముక్కలు బాగా ఉడికి రుచిగా ఉంటాయి.

 

 

 

 

Also Read : Jio Bharat b2: 343 గంటల స్టాండ్‌బై బ్యాటరీతో మార్కెట్‌లోకి Jio Bharat B2 మొబైల్‌..ఫీచర్స్‌, ధర వివరాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News