Sai Pallavi Stylish Stills: హీరోయిన్ సాయి పల్లవికి తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం ఉంది. సౌందర్య తరువాత ఆ రేంజ్ లో పద్ధతి అయిన హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి ఇంస్టాగ్రామ్ ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
Sai Pallavi Viral Pics: ప్రేమమ్ సినిమాతో సినీ ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ సాయి పల్లవి.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించి…మొదటి చిత్రంతోనే అందరిని ఫిదా చేసేసింది ఈ హీరోయిన్.
ఆ చిత్రంలో భానుమతి క్యారెక్టర్ లో ఒదిగిపోయి.. ఇక ఆ క్యారెక్టర్ లో ఎవరిని ఊహించుకోలేనంత అద్భుతంగా నటించింది.
ఆ తరువాత వచ్చిన శ్యాంసింగరాయ్, లవ్ స్టోరీ సినిమాలు కూడా ఈ హీరోయిన్ కి మంచి పేరు తెచ్చిపెట్టాయి.
కాగా ఎప్పుడూ పద్ధతి అయిన దృశ్యంలో కనిపించే సాయి పల్లవి ఈమధ్య ఇంస్టాగ్రామ్ లో స్టైలిష్ డ్రెస్సులో షేర్ చేసిన ఫోటోలు సైతం అందరిని ఆకట్టుకుంటున్నాయి.
బ్లూ అంబ్రెల్లా డ్రెస్సులో కొన్ని రోజులు అలానే జీన్స్ ప్యాంట్ వేసుకొని నేచుర్ ని ఎంజాయ్ చేస్తూ ఇచ్చిన కొన్ని ఫోజులు తన అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి.
ఇవి పాత ఫోటోలే అయినా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ మరోసారి సాయి పల్లవి అభిమానులను ప్రేమలో పడేలా చేస్తున్నాయి.