Benefits Of Ear Piercing: మహిళలకు చెవులు కుట్టించడం అనేది ఎన్నో శతాబ్దాలుగా వస్తున్న ప్రక్రియ. చెవులు కుట్టించుకునే సంప్రదాయం పురాతనమైన పద్ధతి. స్త్రీలే కాకుండా కొన్ని ప్రదేశాల్లో పురుషులకు కూడా ఈ చెవులు కుట్టించుకుంటారు. అయితే చెవిపోగులు ధరించడం కేవలం ఫ్యాషన్ మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్యలాభాలు కూడా ఉన్నాయి. చెవులు కుట్టించుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ఫలితాలు ఏంటో మనం తెలుసుకుందాం..
చెవులు కుట్టించడంలో ఆధ్యాత్మిక పరమైన నమ్మకాలు వున్నప్పటికీ ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ఫలితాలువున్నాయి.
చెవులు కుట్టించుకోవడం వల్ల మహిళలకు ఎన్నో ఆరోగ్య లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఋతు క్రమం నిర్వహించడానికి ఎంతో సహాయపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
చెవిపోగులు వేసుకోవడం వల్ల శరీరంలో పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
చెవి కేంద్ర బిందువుపైన ఒత్తిడి పెట్టడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుందని పరీశోధనలో తేలింది. ఈ విధంగా చెవులు కుట్టించడం జరుగుతుంది.
చెవులు కుట్టించడం వల్ల మనలోని భయం, ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు తగ్గుతాయని ఆరోగ్యనిపుణుల చెబుతున్నారు.
చెవి కుట్టిన పాయింట్ వల్ల మనలో జీర్ణవ్యస్థ సక్రమంగా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
వైద్యుల ప్రకారం చెవి కుట్టడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ మెరుగా జరుగుతుంది. అలాగే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.