PV Narasimha Rao: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు మరణానంతరం భారతరత్న పురస్కారం ప్రకటించింది మోదీ సర్కార్. రావు 1991 నుండి 1996 వరకు భారత ప్రధానిగా ఉన్నారు. ఆయన హయాంలోనే ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. దీంతో దేశం ప్రగతి పథంలో నడిచింది. నెహ్రూ-గాంధీయేతర కుటుంబం నుండి, తొలి దక్షిణాధి ప్రధాని కూడా ఆయనే. రావు భారతరత్న ప్రకటించడంతో పీవీ మనవడు ఎన్వి సుభాష్ ఆనందం వ్యక్తం చేశాడు. మోదీ ప్రభుత్వం పార్టీని చూడకుండా పురస్కారం ప్రకటించడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సంర్భంగా 23 డిసెంబర్ 2004 నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు.
'ఇది నిజంగా కాంగ్రెస్‌కు చెంపపెట్టు. 2004లో తాతగారి పార్థివదేహాన్ని మా కుటుంబ సభ్యుల నిర్ణయానికి వ్యతిరేకంగా హైదరాబాద్ కు పంపడం నాకు గుర్తుంది. అప్పుడు కాంగ్రెస్ చేసిన పనే ఇప్పుడు ఆ పార్టీకి శాపంగా మారిందని'' సుభాష్ అన్నాడు.
రావు, గాంధీ కుటుంబం మధ్య సంబంధాలు ఎలా క్షీణించాయి?
1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు గురైనప్పుడు.. రావు రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడపడానికి రాజీవ్ సతీమణి సోనియా గాంధీ పీవీని ఎన్నుకుంది. బోఫోర్స్ కుంభకోణానికి సంబంధించి రాజీవ్ గాంధీ పై ఆరోపణలు వచ్చాయి. దీంతో పీవీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీనిపై సోనియా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా పీవీ హయాంలో చేసిన ఆర్థిక సంస్కరణలకు కూడా ఆమె అనుకూలంగా లేదు.
సోనియా, పీవీ మధ్య విభేదాలు..
తన భర్త హత్యకు సంబంధించిన విచారణలు నెమ్మదిగా సాగడంపై సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పీవీ ఆత్మకథ రాసిన వినయ్ సీతాపతి రావు పేర్కోన్నారు. అప్పటి నుంచి సోనియా, రావుల మధ్య పెద్దగా మాట్లాలేవని ఆయన తెలిపారు. అంతేకాకుండా కాంగ్రెస్ నేతలంతా సోనియా నివాసం 10 జనపథ్‌కు ఎక్కువగా వెళ్లారని.. అయితే రావు మాత్రం అప్పుడప్పుడు వెళ్లినట్లు తెలిపారు. 1996లో ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. దీంతో పీవీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత పార్టీ ఆయన్ను మరిచిపోయింది.
పీవీకి ఘోర అవమానం..
రావు మరియు గాంధీ కుటుంబాల మధ్య ధ్వేషం ఏ స్థాయిలో ఉండేదంటే 2004, డిసెంబరు 23న పీవీ మరణించినప్పుడు ఆయన మృతదేహాన్ని ఢిల్లీలో ఉన్న 24 అక్బర్ రోడ్‌లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలోకి అనుమతించలేదు. రావు పార్థివదేహాన్ని గేటు బయట ప్లాట్‌ఫారమ్‌పై ఉంచేశారు. దేశ మాజీ ప్రధాని, మాజీ సీఎం, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు పట్ల సోనియా, కాంగ్రెస్ పార్టీ నాయకులు అత్యంత అవమానకరంగా వ్యవహారించినట్లు సీతాపతి పీవీ ఆత్మకథ అయిన 'హాఫ్ లయన్' లో పేర్కొన్నారు. మృతదేహాన్ని లోపలికి అనుమతించాలని రావు స్నేహితుడు కాంగ్రెస్ సీనియర్ నేతను కోరాడు. అతడు తలుపు తెరుచుకోవడం లేదని బదులివ్వడం హాస్యాస్పదం.
లోపలికి అనుమతించకపోవడంతో.. చివరకు పీవీ పార్థివ్ దేహాన్ని హైదరాబాద్ కు తరలించారు. హుస్సేన్ సాగర్ ఒడ్డున జరిగిన పీవీ అంత్యక్రియలకు సోనియా రాలేదు. మన్మోహాన్, తదితర మంత్రులు హాజరయ్యారు. బీజేపీ అగ్రనేత అద్వానీ కూడా పీవీ పార్థీవ దేహాన్ని చూసేందుకు వచ్చారు. ఎలాంటి అధికారిక పదవిని చేపట్టని సంజయ్ గాంధీకి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపగా.. పీవీ పట్ల కాంగ్రెస్ ప్రవర్తించిన తీరు సరైనది కాదు. . శుక్రవారం (09 ఫిబ్రవరి 2024), మోడీ ప్రభుత్వం రావుకు మరణానంతరం భారతరత్న ఇవ్వాలని ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలిపారు. ఇది చాలా సంతోషకరమైన క్షణం..ఆనందంగా ఉందంటూ పీవీ నరసింహారావు కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు.
Also Read: PV Narasimha Rao: తెలుగు బిడ్డకు భారత రత్న.. పీవీ నరసింహరావుకు దేశ అత్యున్నత పురస్కారం ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter