Benefits Of Walking: వాకింగ్‌తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Amazing Health Benefits Of Walking: ప్రతిరోజు వాకింగ్‌ చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతుంటారు. ఉదయం పూట వాకింగ్ చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన సమస్యలు తగ్గుతాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 8, 2024, 05:45 PM IST
Benefits Of Walking: వాకింగ్‌తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Amazing Health Benefits Of Walking: ఆరోగ్యనిపుణుల ప్రకారం ఉదయం ప్రతిరోజు 45 నుంచి 60 నిమిషాలు పాటు నడకకు కేటాయించాలని  సూచిస్తున్నారు. వాకింగ్‌ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్యలాభాలు కలుగుతాయి.  ప్రతిరోజు వాకింగ్‌ చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన, అలసట వంటి సమస్యలు మన దరికి చేరవని వైద్యులు చెబుతున్నారు. అయితే వాకింగ్‌ చేయడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.

ప్రతిరోజు ఉదయం వాకింగ్‌ చేయడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. అలాగే మెదడుకు రక్త సరఫరాను పెంచడంలో సహాయపడుతుంది. చిన్నపిల్లలు వాకింగ్‌ చేయడం వల్ల వారి జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది. వారు ఏకాగ్రతగా పని చేయగలరు.  వాకింగ్‌ చేయడం వల్ల నేచురల్ స్లీప్ హార్మోన్ ప్రభావాలను పెంచి నిద్రపోవడానికి సహాయపడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారు ఉదయం వాకింగ్ చేయడం వల్ల సుఖమైన నిద్ర కలుగుతుంది.  

సగటు మనిషి రోజుకు 30 నిమిషాలు పాటు వాకింగ్ చేయడం వల్ల ఎలాంటి గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 35 శాతం గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.  కాబట్టి ప్రతిరోజు ఉదయం వాకింగ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు అని చెప్పవచ్చు.   

ప్రస్తుతం చాలా మంది అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా పెద్దలు తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.  ప్రతిరోజు ఉదయం వాకింగ్ చేయడం వల్ల  ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. వాకింగ్ చేయడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌ కరగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. 

అధిక బరువు సమస్య కారణంగా చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు.  వయసుతో సంబంధం లేకుండా చాలా మంది టైప్‌- 2 డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. ప్రతిరోజు ఉదయం 30 నిమిషాల  పాటు వాకింగ్ చేయడం వల్ల ఈ సమస్య తగ్గుతుందని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. 

పెద్దవారిలో తరుచుగా ఇబ్బంది పెట్టే సమస్యలో కీళ్ల నొప్పి, ఎముకల నొప్పి, కండరాల సమస్యలు. దీని కోసం మార్కెట్‌లో లభించే ప్రొడెట్స్‌ను వాడుతుంటారు. కానీ దీని వల్ల కొంత ఉపశమనం కలిగిన సమస్య మళ్లీ మొదటికి చేరుకుంటుంది. ఎలాంటి మందులు, ప్రొడెట్స్‌ వాడకుండా ప్రతిరోజు పది నిమిషాల పాటు వాకింగ్ చేయడం వల్ల ఈ కీళ్ల నొప్పు, ఎముకల నొప్పి, కండరాల సమస్యలకు చెక్‌ పెట్టవచ్చని ఆరోగ్యనిపుణుల చెబుతున్నారు

Also Read  Dry Cough Home Remedies In Telugu: పొడి దగ్గు నుంచి శాశ్వతంగా విముక్తి కలిగించే ఇంటి చిట్కాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x