Cholesterol Tips: కొలెస్ట్రాల్ చాలా వ్యాధులకు మూల కారణం. శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరడం వల్ల రక్తపోటు, గుండె వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, మధుమేహం ఇలా అన్నీ ఒకదాని వెంట మరొకటిగా వెంటాడవచ్చు. అందుకే కొలెస్ట్రాల్ నియంత్రణ అనేది చాలా అవసరం. మరి కొలెస్ట్రాల్ నియంత్రణ ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని చిట్కాలతో సులభంగా తగ్గించవచ్చు. ముఖ్యంగా ఆకుపచ్చని ఆకుల్లో ఉండే అద్భుతమైన ఔషధాలు కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను చాలా సులభంగా తగ్గిస్తాయి. వాస్తవానికి కొలెస్ట్రాల్ అనేది మాంసకృతులు, హార్మోన్స్ తయారీలో ఉపయోగపడతాయి. అయితే ఇది పరిమితంగా ఉండాలి. మోతాదు మించితే వివిధ రకాల సమస్యలకు కారణమౌతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్ వయస్సును బట్టి మారుతుంటుంద. కొలెస్ట్రాల్ అనేది సాధారంగా జీవనశైలి సరిగ్గా లేకపోవడం వల్ల వస్తుంది. చాలామంది మెడిసిన్ తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ నియంత్రిస్తుంటారు. కానీ ప్రకృతి సహాయంతో సహజసిద్దంగా తగ్గించుకుంటే మంచిది.
కరివేపాకు గురించి అందరికీ తెలిసిందే. ప్రకృతిలో విరివిగా లభించే కరివేపాకు కొలెస్ట్రాల్ తగ్గించడంలో చాలా అద్బుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను తగ్గిస్తాయి. గుడ్ కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీనికోసం రోజూ 8-10 కరివేపాకుల్ని వంటల్లో ఉపయోగించవచ్చు లేదా జ్యూస్ చేసుకుని తాగవచ్చు.
కొలెస్ట్రాల్ తగ్గించే మరో అద్భుతమైన ఔషదం కొత్తిమీర. ప్రతి వంటింట్లో తప్పకుండా లభిస్తుంది. కేవలం వంటల్లోనే ఉపయోగిస్తుంటారు. కానీ ఆరోగ్య పరిరక్షణలో కొత్తిమీర అద్భుతంగా ఉపయోగపడుతుంది. కొత్తిమీరను సలాడ్ రూపంలో లేదా చట్నీ చేసి తినవచ్చు.
నేరేడు ఆకులు కూడా కొలెస్ట్రాల్ తగ్గించడంలో చాలా బాగా దోహదపడతాయి. నేరేడు ఆకులు మంచి ప్రత్యామ్నాయం. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఏంథోసయానిన్ వంటి గుణాలు నరాల్లో కొవ్వు పేరుకుపోకుండా నియంత్రిస్తాయి. నేరేడు ఆకుల్ని పౌడర్‌గా చేసుకుని టీ చేసుకుని తాగవచ్చు లేదా గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగవచ్చు.
మెంతి ఆకులు కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను అద్భుతంగా తగ్గిస్తాయి. శరీరంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్, ట్రై గ్లిసరైడ్స్ను చాలా వేగంగా తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ నియంత్రణలో కీలకంగా ఉపయోగపడుతుంది. కూర రూపంలో వండుకుని తినవచ్చు.
ఆయుర్వేద మూలికల ఖజానాగా భావించే తులసి ఆకులు కొలెస్ట్రాల్ నియంత్రణకు అద్భుతంగా ఉపయోగపడతాయి. తులసి ఆకులు చాలా ప్రయోజనకరం. ఇందులో ఉండే పోషకాలు మెటబోలిక్ స్ట్రెస్ తగ్గిస్తాయి. బరువు నియంత్రణలో కూడా అద్భుతంగా ఉపయోగపడతాయి. తులసి ఆకుల్ని రోజూ పరగడుపున నమిలి తినవచ్చు లేదా గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగవచ్చు.
Also read: Walnuts Benefits: రోజుకు కొన్ని వాల్నట్స్ తింటే చాలు ఈ వ్యాధులు దరిచేరవు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook