Nail Care Tips: మనం తెలిసో తెలియకో రోజంతా శరీరంలోని అన్ని భాగాల్ని చేతులతో టచ్ చేస్తుంటాం. కానీ మీ చేతి వేళ్లకుండే అందమైన గోర్లే సగం అనారోగ్యానికి కారణమౌతున్నాయని మీకు తెలుసా. గోర్లలో కోట్లాది మైక్రో ఆర్గనిజమ్స్ ఉంటాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మనిషి చేతికి అందాన్నిచ్చేది గోర్లే. అందుకే అమ్మాయిలు గోర్లను ప్రత్యేకంగా అలంకరించుకుంటుంటారు. కానీ 2021లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం మనిషి అనారోగ్యానికి సగం కారణం ఈ గోర్లే అని తెలిసింది. గోర్లలో కోట్లాది మైక్రో ఆర్గనిజమ్స్ ఉంటాయని తేలింది. గోర్ల అడుగున 32 రకాల బ్యాక్టీరియా, 28 రకాల ఫంగస్ ఉంటాయని అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనం అమెరికన్ పీడియాట్రిక్ మెడికల్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురితమైంది. గోర్ల కింద సేకరించిన శాంపుల్చ్ పరీక్షించినప్పుడు 32 రకాల బ్యాక్టీరియా, 28 రకాల ఫంగస్ బయటపడ్డాయి. ఇందులో 50 శాతం శాంఫిల్స్లో కేవలం బ్యాక్టీరియా ఉంటే 6.3 శాతంలో ఫంగస్ ఉంది. 43.7 శాతంలో బ్యాక్టీరియా, ఫంగస్ రెండూ ఉన్నాయి.
ఇదే అధ్యయనం కాలి గోర్లకు కూడా చేశారు. కానీ శుభ్రతపై అవగాహన కల్పించే క్రమంలో గోర్లపై జరిగిన అధ్యయనంలో వెలుగు చూసిన వాస్తవాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. రోజూ మనం మన చేతుల్ని ముఖానికి, కళ్లకు, చెవులకు, ముక్కుకు ఇలా ఎక్కడెక్కడో తాకిస్తుంటాం. అందుకే గోర్లు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండాలి. గోర్ల అడుగున ఉండే బ్యాక్టీరియా, ఫంగస్ సాధారణంగా హానిరహితంగానే ఉంటాయని కానీ కొన్ని సందర్భాల్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నప్పుడు గోర్లకు ఏదైనా గాయం తగిలితే లేదా ఇన్ఫెక్షన్ అయితే ఈ మైక్రో ఆర్గనిజమ్స్ ఆ ఇన్ఫెక్షన్ను పెంచి పెద్దవిచేస్తాయి. గోర్లు రంగు మారడం, స్వెల్లింగ్, నొప్పి వంటివి ప్రధానంగా ఉంటాయి.
అందుకే ప్రతిరోజూ కనీసం రెండు సార్లు చేతులు, గోర్లను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. గోర్ల కింద పేరుకునే వ్యర్ధాల్ని తొలగించేందుకు మృదువైన బ్రష్ ఉపయోగించారు. అందుకే గోర్లు పెంచకుండా చూసుకోవాలి. గోర్లు పొడుగ్గా ఉండటం వల్లనే ఇందులో వ్యర్ధాలు, మలినాలు పేరుకుపోతుంటాయి. గోర్లను ఎప్పటికప్పుడు ట్రిమ్ చేస్తుండాలి. గోర్లకు నెయిల్ పాలిష్ రాసే అలవాటుంటే ముందు తరువాత గోర్లను శుభ్రం చేసుకోవాలి. గోర్లలో ఫంగల్ ఇన్ఫెక్షన్ కన్పిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Also read: Quickest Way To Lose Weight: అలోవెరాతో బరువు తగ్గడం ఎలా? ఈ చిట్కా మీ కోసమే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook