Worst Time To Eat Banana: అరటి పండును తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. దీని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అరటిపండులో
విటమిన్ సి,B6, ఫైబర్, మెగ్నీషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతిరోజు అరటిని తీసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా కోల్పోయిన శక్తిని తిరిగి పొందడంలో అరటి పండు ఎంతో మేలు చేస్తుంది.
ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో ఈ పండును తీసుకోవడం వల్ల శరీరం ఉత్సాహంగా ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే అరటి పండును కొన్ని పదార్థాలతో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి నష్టం కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఎలాంటి సమయంలో వీటిని తీసుకోకుండా ఉండాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఎలాంటి పదార్థాలతో అరటి పండు తినకూడదు:
✶ మనం కొన్ని రకాల ఆహార పదార్థాలను పాలలో కలిపి తింటాము. కానీ అరటి పండును పాలలో కలిపి తినడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
✶ ఉదయం, సాయంత్రం అరటి పండు తినడం చాలా మంచిది. కానీ రాత్రి పూట అరటి పండును తినకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల జలుబు, మ్యూకస్ వంటి సమస్యలు తలెత్తుతాయి.
✶ మధ్యాహ్న భోజనం తర్వాత చాలా మంది పండ్లను తింటారు. అయితే అరటి పండును మాత్రం తినకూడదని వైద్యులు చెబుతున్నారు.
✶ చాలామంది పాలు తాగాక అరటి పండును తింటుంటారు. అయితే ఈ రెండు పద్ధతులూ ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతున్నారు.దీని వల్ల ఆమ్లతత్త్వం తయారు అవుతుంది.
✶ అలాగే పరగడుపున అరటి పండు తినడం వల్ల జీర్ణసంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
ఈ విధంగా అరటి పండును ఈ పదార్థాలతో తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. మీరు కానీ ఈ పండును ఇక్కడ చెప్పిన పదార్థాలతో తింటే వెంటనే అలా చేయడం మంచిది. వీటని తినడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. కాబట్టి వీటిని తీసుకోకుండా ఉండటం చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter