Interview Tips: అసలు ఫస్ట్ ఇంప్రెషన్ అంటే ఏమిటి. మిమ్మల్ని ఎవరైనా మొదటిసారి చూసినప్పుడు లేదా మీరు ఎవరినైనా మొదటిసారి చూసినప్పుడు మీ గురించి ఆ వ్యక్తికి లేదా ఆ వ్యక్తికి మీ గురించి కలిగే ఫీలింగ్ ఇది. ఇది చాలా కీలకమైంది. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ బాగుండి తరువాత నచ్చకున్నా ఫరవాలేదు గానీ , ఫస్ట్ ఇంప్రెషన్ బాగా లేకపోతే తరువాత ఎన్ని ప్రయత్నాలు చేసినా నిష్ప్రయోజనమే.
ముఖ్యంగా ఉద్యోగ ఇంటర్వ్యూల్లో ఫస్ట్ ఇంప్రెషన్ చాలా అవసరం. ఇంటర్వూూ చేసే వ్యక్తి మీ వస్త్ర ధారణ, మీ మాట తీరు, మీ బాడి లాంగ్వేజ్ వంటి అంశాల ద్వారా మీపై ఓ అవగాహనకు వచ్చేస్తాడు. మీ బాడీ లాంగ్వేజ్‌పై మీరు దృష్టి సారించకుంటే మీపట్ల మంచి ఇంప్రెషన్ పడదు. అందుకే బాడీ లాంగ్వేజ్ చాలా ముఖ్యం. ఈ విషయంలో అంటే ఇంటర్వ్యూల్లో బాడీ లాంగ్వేజ్ విషయంలో చేయకూడని 5 పొరపాట్లు లేదా తప్పులేంటో తెలుసుకుందాం.
మాట్లాడేటప్పుడు నోట్లో లేదా పెదవుల్లో వేలు పెట్టడం మంచి అలవాటు కాదు. ఇది ఆందోళన లేదా అసహనానికి సంకేతం కావచ్చు. ఇంటర్వ్యూ మధ్యలో మీరు ఇలా చేయడం వల్ల మీకు ఉద్యోగంపై పెద్దగా సీరియస్‌నెస్ లేదనే అభిప్రాయం కలగవచ్చు. అందుకే ఈ అలవాటును మానుకోవాలి. కొంతమందికి యాధృచ్ఛికంగా ఈ అలవాటు ఉంటుంది.
ఇంటర్వ్యూ ఎదుర్కొనేటప్పుడు సరిగ్గా పూర్తి ఆత్మ విశ్వాసంతో ఉండాలి. అసౌకర్యంగా కూర్చోకూడదు. మీరు అసౌకర్యంగా ఉంటే ఇంటర్వ్యూకు సిద్ధంగా లేరనే ఆభిప్రాయం రావచ్చు ఇంటర్వ్యూ చేసేవ్యక్తికి. అందుకే ఇంటర్వ్యూకు సిద్ఘంగా ఉన్నా లేకున్నా పూర్తి ఆత్మ విశ్వాసంతో కూర్చోవాలి. రిలాక్స్‌గా కూర్చోవాలి.
ఇంటర్వూ జరుగుతున్నప్పుడు ఏదైనా విషయానికి అతిగా స్పందించడం లేదా అతిగా నవ్వడం మంచిది కాదు. ఇది మీ బాడి లాంగ్వేజ్ అసౌకర్యంగా ఉందనేందుకు ఉదాహరణ. మీలో ఒత్తిడి ఉందని, మీ సమాధానాలు నిజమని రుజువు చేసేందుకు అలా చేస్తున్నారని భావించవచ్చు.
ఇంటర్వ్యూ చేసేటప్పుడు చాలామంది చేసే పొరపాటు కళ్లలో చూసి మాట్లాడకపోవడం. అంటే ఇంటర్వ్యూ చేసే వ్యక్తి వైపు కాకుండా మరెక్కడో చూస్తూ మాట్లాడటం లేదా తలదించుకుని మాట్లాడటం. ఇలా చేయడం వల్ల మీరేదో అబద్ధం చెబుతున్నారనే భావన రావచ్చు. అందుకే కళ్లు కలిపి మాట్లాడటం అలవర్చుకోవాలి.
మాట్లాడేటప్పుడు తరచూ చేతులు లేదా వేళ్లు ఆడిస్తూ మాట్లాడటం మంచిది కాదు. ఇది మీలోని అనిశ్చితి, అసౌకర్యానికి చిహ్నం కావచ్చు. ఇలా మాట్లాడటం మంచి యాటిట్యూడ్ కానే కాదు. అవతలి వ్యక్తికి మంచి ఇంప్రెషన్ ఏర్పడదు.
Also read: Skin Glow tips: అల్లోవెరాతో ఇలా ఫేస్‌మాస్క్ చేసుకుని రాసుకుంటే..చర్మం మిళమిళమెరవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook