Asthma During Winter: శీతాకాలంలో వాతావరణంలోని తేమ పరిమాణం ఒక్కసారిగా పెరిగి చాలామందిలో శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతింటుంది. ముఖ్యంగా చల్లగాలి పీల్చుకోవడం వల్ల శ్వాస నాళాలు ప్రభావితమై దగ్గు, కఫం, శ్వాస ఆడక పోవడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. దీని కారణంగానే కొంతమందిలో ఉబ్బసం వంటి లక్షణాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
దీంతోపాటు శీతాకాలం కొంతమందిలో వాతావరణంలోని దుమ్ము, దూళి కారణంగా శ్వాస ఇన్ఫెక్షన్లు పెరిగి ఆస్తమా కూడా దారి తీయవచ్చు. కాబట్టి శీతాకాల సమయంలో ఇప్పటికే ఆస్తమా లక్షణాలు కలిగిన వారు పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలను తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. అయితే ఈ సమయంలో ఆస్తమా ఉన్నవారు ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆస్తమా ఉన్నవారు తప్పకుండా ఈ ఈ జాగ్రత్తలు తప్పనిసరి:
హైడ్రేటెడ్‌గా ఉండండి:
ఆస్తమా ఉన్నవారు శీతాకాలంలో తప్పకుండా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేకపోతే వాతావరణంలోని తేమ పెరగడం కారణంగా ఊపిరితిత్తులపై ప్రభావం పడి, శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి శ్వాసకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండడానికి ఆస్తమా ఉన్నవారు తప్పకుండా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోండి.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
చేతులను శుభ్రంగా ఉంచుకోండి:
ప్రస్తుతం చాలామంది ఆస్తమాతో బాధపడుతున్న వారు ఆపరిశుభ్రతను పాటిస్తున్నారు. దీనికి కారణంగానే శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోవాల్సి ఉంటుంది. దీంతోపాటు ప్రతిరోజు శరీరాన్ని రెండుసార్లు సిద్ధం చేసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter