Skin Care Tips: ముఖం అందంగా మిళమిళలాడుతుండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందుకే అమ్మాయిలు మార్కెట్లో లభించే ఖరీదైన క్రీములు వినియోగిస్తుంటారు. అయితే వీటివల్ల దుష్పరిణామాలు ఎక్కువగా ఉండవచ్చు. ఆయిలీ స్కిన్ సమస్య ఉండేవాళ్లు ముఖంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్లు కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు.
ఆయిలీ స్కిన్ సమస్య ఉన్నవాళ్లు ముఖాన్ని ఎప్పుడూ తాజాగా ఉంచుకోవాలి. మార్కెట్లో లభించే వివిధ రకాల ఉత్పత్తుల్ని అదే పనిగా ఉపయోగించకూడదు.
నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల ముఖం నిగనిగలాడుతుంటుంది. ఆహారం తగ్గించినా ఫరవాలేదు గానీ నీళ్లు మాత్రం తగ్గించకూడదు.
చాలామందికి ముఖంపై పింపుల్స్ వస్తుంటాయి. అదేపనిగా ముఖంపై చేతులు టచ్ చేస్తుంటే చర్మం దెబ్బతింటుంది. చెమట కారణంగా చేతులపై ఉండే జర్మ్స్ ముఖంపై చేరే ప్రమాదముంది.
ఆయిలీ స్కిన్ సమస్యతో బాధపడేవాళ్లు ఫేస్ వాష్ ఎక్కువగా వినియోగించకూడదు. ముఖాన్ని రోజుకు 4 సార్లు కచ్చితంగా శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఆయిల్ చేరదు.
ఆయిసీ స్కిన్ సమస్య ఉన్నవాళ్లు ముఖంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముఖాన్ని తరచూ శుభ్రం చేస్తుండాలి. బయట్నించి వచ్చిన వెంటనే ముఖం కడగకూడదు.