Happy Republic Day Special Quotes And Wishes Telugu 2024: ప్రతి సంవత్సరం జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా భారతీయులంతా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇలాంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజున ప్రతి ఒక్కరు రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ.. వారి కోసం ప్రత్యేక శుభాకాంక్షలు..
Happy Republic Day Special Quotes And Wishes Telugu 2024: 1950 జనవరి 26 భారతదేశానికి ఓ ప్రత్యేకమైన రోజు..భారత్ స్వాతంత్ర రాజ్యాంగ ఏర్పడిన రోజు..అధికారికంగా భారతదేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. 1949లో చట్టసభల్లో భారత రాజ్యాంగం ఆమోదం పొందిన తర్వాత 1950 జనవరి 26వ తేదీన భారతదేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అందుకే ఈ రోజున భారతీయులంతా ఎంతో ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. ఇలాంటి ఎంతో ప్రాముఖ్యమైన రోజు అందరికీ గుర్తుండిపోయేలా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సోషల్ మీడియా ద్వారా మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు తెలియజేయండి.
జనవరి 26న భారతదేశం ప్రజా ప్రభుత్వంగా ఏర్పడిన సందర్భంగా..ప్రతి ఒక్కరు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని కోరుకుంటూ.. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
భారతదేశం స్వేచ్ఛ కోసం త్యాగం చేసిన మహానుభావులు ఎందరో.. స్వాతంత్ర దేశం కోసం ఆత్మ బలిదానాలు చేసిన అమరవీరులెందరో.. వారందరినీ స్మరించుకుంటూ ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుందాం..
ఎందరో అమరవీరుల త్యాగాలకి ఫలితం వచ్చిన ఈ రోజున.. ప్రతి ఒక్కరూ వారిని స్మరించుకుంటూ.. గణతంత్ర దినోత్సవ ప్రత్యేక శుభాకాంక్షలు.
భారతదేశం ఇంత గొప్ప చరిత్ర, వారసత్వాన్ని కలిగి ఉండడం మనం చేసుకున్న పుణ్యమే..ఇలాంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన దేశంలో పుట్టినందుకు మనమంతా ఎంతో గర్వపడదాం.. మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగంలోని విలువలను సంరక్షిస్తూ..ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సమాజంలో జీవనం సాగించాలని కోరుకుంటూ.. ప్రతి ఒక్కరికి 75 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
తెల్ల దొరల పాలనపై ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి పోరాడిన ప్రతి ఒక్క అమరవీరుడిని స్మరించుకుంటూ..హ్యాపీ రిపబ్లిక్ డే.
ఈ 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. మనమంతా స్వాతంత్రం కోసం పోరాడిన సమరయోధులను స్మరించుకుంటూ.. మన వారసత్వ సంపదను కాపాడుకుందామని ప్రతిజ్ఞ చేద్దాం..హ్యాపీ రిపబ్లిక్ డే..
భారతదేశంలో జాతులు వేరైనా.. మతాలు వేరైనా మనుషులు మాత్రం ఒకటే.. ఎల్లప్పుడు మన దేశం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ.. ప్రతి భారతీయునికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.