Tata Punch Ev Launch: త్వరలోనే EV వేరియంట్‌లో టాటా పంచ్..మైలేజ్‌, ధర వివరాలు ఇవే..

Tata Punch Ev Mileage, Price Details: టాటా నుంచి త్వరలోనే పంచ్ EV వేరియంట్ విడుదల కాబోతోంది. ఈ కారు అనేక మార్పుల చేర్పులతో రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఎన్నో రకాల కొత్త ఫీచర్లను టాటా అందించబోతున్నట్లు సమాచారం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 19, 2024, 07:36 AM IST
Tata Punch Ev Launch: త్వరలోనే EV వేరియంట్‌లో టాటా పంచ్..మైలేజ్‌, ధర వివరాలు ఇవే..

Tata Punch Ev Mileage, Price Details: ఆటోమొబైల్ మార్కెట్లో టాటా మోటార్స్ ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన టాటా పంచ్ కి ఉన్న క్రేజ్ అంతో ఎంతో కాదు. ఈ పంచ్ మార్కెట్‌లో మైక్రో SUV గా విడుదలై గొప్ప ప్రజాదరణ పొందింది. ఇందులో ICE నుంచి CNG మోడల్స్ నుంచి మొదలుకొని ఇప్పటికీ అన్ని హిట్ అయ్యాయి. అయితే అతి త్వరలోనే టాటా కంపెనీ EV వేరియంట్లలో కూడా మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కంపెనీ టాటా పంచ్ ను 2021 అక్టోబర్‌లో లాంచ్ చేయగా.. 2025 నాటికి EV వేరియంట్ ను విడుదల చేయబోతున్నట్లు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ యూనిట్ ఎండి శైలేష్ చంద్ర తెలిపారు..

Tata Punchలో వచ్చే మార్పులు?:
త్వరలోనే విడుదల కాబోయే టాటా పంచ్ EV వేరియంట్‌లో కంపెనీ చాలా పెద్ద మార్పులు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.. దీంట్లో ముఖ్యంగా ఫ్రంట్ బంపర్, గ్రిల్‌లలో మార్పులు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు హెడ్‌ల్యాంప్‌లు, బానెట్‌లలో స్వల్ప మార్పులను తీసుకువచ్చే ఛాన్స్ ఉందని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఫర్నిచర్ తో పాటు మైలేజీలో కూడా అనేక మార్పులు ఉండే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

టాటా పంచ్ EV డిజైన్, ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
టాటా పంచ్ EV కార్లు అనేక కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి రాబోతున్నట్లు సమాచారం ముఖ్యంగా Nexon ఫేస్‌లిఫ్ట్ లాగా LED లైట్ బార్‌ను కూడా అందించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు స్ప్లిట్ LED హెడ్‌లైట్‌లు ఫ్రంట్ బంపర్‌లో కలిపి తీసుకురాబోతున్నట్లు సమాచారం. వెనుక భాగంలో పంచ్ EV.. ICE మోడల్ లాగా టైల్‌లైట్ డిజైన్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో Y-ఆకారపు బ్రేక్ లైట్లు, రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్, బంపర్ డిజైన్ కలిగి ఉంటాయి. సైడ్ ప్రొఫైల్‌లో ఇప్పుడు 16 అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, అన్ని చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు ఉండబోతున్నట్లు ఇంటర్నెట్లో వార్తలు వస్తున్నాయి.

టాటా పంచ్ EV ఇతర స్పెసిఫికేషన్స్‌:
✽ 35 kWh బ్యాటరీ ప్యాక్‌
✽ 3.3 kW వాల్‌బాక్స్ ఛార్జర్
✽ 50Kw DC ఫాస్ట్ ఛార్జర్‌
✽ 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌
✽ టూ-స్పోక్ స్టీరింగ్ వీల్‌
✽ 6 ఎయిర్‌బ్యాగ్‌లు
✽ క్రూయిజ్ కంట్రోల్ 
✽ ABS, ESC, ESP
✽ వాయిస్ కమాండ్‌

Also read: Happy Kanuma Wishes 2024: కనుమ పండగ ప్రత్యేక శుభాకాంక్షలు, స్పెషల్ కోట్స్, గ్రీటింగ్స్, సోషల్ మీడియా మెసేజెస్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News