Makar Sankranti 2024 Rasi Phalalu: హిందువులకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండగల్లో మకర సంక్రాంతి ఒకటి. ఈ పండగను ప్రతి సంవత్సరం సూర్య గ్రహం మకర రాశిలోకి సంచారం చేసిన రోజే జరుపుకుంటారు. ఈ సమయంలో శుభముహూర్తాల్లో స్నానం చేయడం దానం చేయడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శుభ సమయాల్లో దానం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సంవత్సరం జనవరి 15న గ్రహాలకు రాజు అయిన సూర్యుడు మకర రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కన్య ధనస్సు రాశితో పాటు మరికొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి.
మేషరాశి:
మేష రాశి వారికి మకర సంక్రాంతి నుంచి అనేక ఆర్థిక లాభాలు కలుగుతాయి. సూర్యుడు మకర రాశిలోకి సంచారం చేయడం కారణంగా వీరి ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. దీంతోపాటు కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. అలాగే వీరు ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వల్ల విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయంలో ఒత్తిడి తగ్గుతుంది స్నేహితులతో కలిసి కాలక్షేపం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి సూర్యగ్రహ సంచార ప్రభావం చాలా శుభ్రంగా ఉండబోతోంది ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి సంక్రాంతి తర్వాత ప్రమోషన్స్ తో పాటు జీతాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా ఈ సమయంలో కష్టపడి పనిచేయడం వల్ల అధికారుల మద్దతు లభించి ప్రశంసలు కూడా పొందుతారు. దీంతోపాటు సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా రెట్టింపు అవుతాయి.
Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..
కన్యా రాశి:
కన్యా రాశి వారికి సూర్య గ్రహ సంచారం కారణంగా తిరుగులేని జీవితాన్ని పొందబోతున్నారు. ఈ సమయంలో సానుకూల మార్పులతో ముందడుగు వేస్తారు. అంతేకాకుండా ప్రత్యర్థులపై పెత్తనాన్ని చెలాయించి విజయాలు సాధిస్తారు. ఇక ఆఫీసుల్లో బిజీ బిజీగా ఉన్నవారికి కొంత ప్రశాంతత లభిస్తుంది. అంతేకాకుండా కష్టపడి పనిచేయడం వల్ల ఎంతో గౌరవం కూడా పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా విహారయాత్రలకు వెళ్తారు.
ధనస్సు రాశి:
ఈ సమయం ధనస్సు రాశి వారికి కూడా చాలా ప్రత్యేకమైనదిగా భావించవచ్చు. సూర్య గ్రహ సంచారంతో వీరికి అనేక రకాల లాభాలు కలుగుతాయి. దీంతోపాటు ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా విజయాలు సాధిస్తారు. ఇక విద్యార్థులకు మంచిర్యాంకులు లభించి విశ్వవిద్యాలయాల్లో సీట్లు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో పూజలపై ఆసక్తి రెట్టింపు అవుతుంది.
Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter