Iron Deficiency: మనిషి శరీరానికి ప్రతి పోషకం అత్యవసరం. తినే ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేట్టు చూసుకోవాలి. శరీర నిర్మాణంలో అవసరమైన వివిధ పోషకాల్లో ఐరన్ అతి ముఖ్యమైంది. ఐరన్ లోపముంటే చాలా సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. శరీరంలో ఐరన్ లోపిస్తే కన్పించే లక్షణాల గురించి తెలుసుకుందాం..
హార్ట్ బీట్ హార్ట్ బీట్ వేగంగా పెరిగిపోతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. ఐరన్ లోపం వల్లనే ఇలా జరుగుతుంది.
కేశాలు రాలడం మీ తల జుట్టు వేగంగా అదే పనిగా రాలుతున్నాయంటే ఐరన్ లోపముందని స్పష్టంగా అర్దం చేసుకోవచ్చు.
కళ్లు, ముఖం పేలగా మారడం శరీరంలో ఐరన్ లోపిస్తే ముఖం పీలగా మారుతుంది. ముఖంపై కాంతి తగ్గుతుంది. కంటి కింద తెల్లని చారలే కన్పిస్తాయి. ఇమ్యూనిటీ బలహీనమౌతుంది.
శ్వాశలో సమస్య ఐరన్ లోపం వల్ల శ్వాసలో సమస్య ఉత్పన్నమౌతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురౌతుంది. అందుకే సాధ్యమైనంత వరకూ ఆకుపచ్చని కూరలు తీసుకోవాలి.
అలసట ఏదైనా విటమిన్ తగ్గితే శరీరంలో చాలా సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అదే విధంగా ఐరన్ లోపిస్తే ఏ పనీ చేయకపోయినా ఊరికే అలసట వచ్చేస్తుంటుంది.