Vijaykanth: కెప్టెన్ అనే పేరు.. పోలీస్ అంటే ఆయనే.. విజయ్ కాంత్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

Vijaykanth Death: గత కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న తమిళ స్టార్ యాక్టర్ కెప్టెన్ విజయ్ కాంత్ ఈ రోజు ఉదయం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. విజయ్‌కాంత్‌ ని ఆయన అభిమానులు అందరూ ముద్దుగా కెప్టెన్ అని పిలుచుకుంటారు. అయితే ఆ పేరు ఆయనకు ఎందుకు వచ్చిందో తెలుసా?

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 28, 2023, 11:03 AM IST
Vijaykanth: కెప్టెన్ అనే పేరు.. పోలీస్ అంటే ఆయనే.. విజయ్ కాంత్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

Vijaykanth Interesting Facts: విజయ్‌కాంత్‌ ని ఆయన అభిమానులు అందరూ ఎంతో ముద్దుగా కెప్టెన్ అని పిలుచుకుంటారు. విజయ్‌కాంత్‌ కూడా కెప్టెన్ పేరు మీదే రెండు ఛానల్స్ కూడా ప్రారంభించారు. అయితే నా పేరు ఆయనకు ఎందుకు వచ్చిందో తెలుసా?

తమిళంలో ఎన్నో యాక్షన్ సినిమాలు చేశారు హీరో విజయ్ కాంత్. 80, 90ల్లో వరుస సినిమాలతో హిట్స్ కొట్టారు. ఆయన ముఖ్యంగా విజయ్‌కాంత్‌ ఎక్కువగా పోలీస్ పాత్రల్లో, లీడర్ పాత్రల్లో నటించారు. 1991లో వచ్చిన ‘కెప్టెన్ ప్రభాకరన్’ అనే కమర్షియల్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచి ఆయన్ని స్టార్ హీరోల్లో ఒకరిగా నిలబెట్టింది. ఈ సినిమాని రోజా భర్త RK సెల్వమణి తెరకెక్కించారు. ఈ చిత్రం భారీ హిట్ అవ్వడంతో ఆ తర్వాత అభిమానులు, మీడియా విజయ్‌కాంత్‌ ని కెప్టెన్ అని సంబోధించడం మొదలుపెట్టాయి. దానికి తగ్గట్టే ఆయన పోలీస్, ఆర్మీ పాత్రలు ఎక్కువగా చేయడంతో.. అభిమానులందరూ విజయ్‌కాంత్‌ ని కెప్టెన్ అని పిలవడం మొదలుపెట్టారు. అలా ఆయనకి ఆ పేరు వచ్చింది.

154 పైగా సినిమాల్లో ఆయన నటించిన విజయ్ కాంత్ 1979లో ఇనిక్కుం ఇలామై చిత్రంతో తమిళ ఇండస్టీలో ఆడుగు పెట్టగా.. చివరగా 2015 సంవత్సరంలో యాక్షన్ థ్రిల్లర్ సగప్తంలో నటించారు. కాగా హీరోగా విజయ్ కాంత్ ఎకంగా 20కి పైగా సినిమాల్లో పోలీస్ క్యారెక్టర్లు చేశారు. ఒకప్పుడు సినిమాలో పోలీస్ క్యారెక్టర్ అంతే విజయ్ కాంత్ గుర్తొచ్చేవారు. తమిళంలో ఏదైనా పోలీస్ సినిమా తీస్తున్నారు అంటే వెంటనే ఆ సినిమా దర్శకుడు ప్రొడ్యూసర్ విజయ్ కాంత్ నే హీరోగా అనుకునే వారట. అలా పోలీస్ అంటే విజయ్ కాంత్ విజయ్ కాంత్ అంటే పోలీస్ క్యారెక్టర్ అనే లాగా ఆయన తమిళ ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. కాగా ఆయన పోలీసుగా చేసిన ఎన్నో సినిమాలు తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా సూపర్ హిట్ గా నిలిచాయి.

దీంతో తమిళ ఇండస్ట్రీలో.. అలానే తెలుగు ఇండస్ట్రీ లో పోలీస్ క్యారెక్టర్ కు విజయ్ కాంత్ పెట్టింది పేరుగా గుర్తింపు సాధించారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కరోనా సోకడంతో ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఇక ఈ వార్త ఆయన అభిమానులను శోకసంద్రంలో ముంచింది. 

Also Read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

Also Read: Corona Jn.1 Precautions: దేశంలో కరోనా కొత్త వేరియంట్ భయం, లక్షణాలెలా ఉంటాయి

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News