ఛార్జీషీట్ నమోదైనంత మాత్రానా ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆదేశించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టాలు చేసే అధికారం కేవలం పార్లమెంట్‌కు మాత్రమే ఉందని పేర్కొంది. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయా కేసుల్లో దోషులుగా తేలకముందే వారిని అనర్హులుగా ప్రకటించాలా? లేదా? అన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది.
భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. శాశన వ్యవస్థే దీనిపై నిర్ణయం తీసుకోవాలని రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. అవినీతి ఖచ్చితంగా ఆర్ధిక ఉగ్రవాదమే అని జస్టిస్ దీపక్ మిశ్ర్రాలతో కూడిన న్యాయస్థానం అభిప్రాయపడింది. ఛార్జ్‌షీట్ ఆధారంగా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను అడ్డుకోలేమని సుప్రీం తెలిపింది.
'రాజకీయాల నుండి నేరస్థులను దూరంగా ఉంచాలి. పార్లమెంటు ఆ మేరకు చట్టాలను రూపొందించుకోవాలి. చార్జ్‌షీట్ ఉన్నంత మాత్రాన అతడిని ఎన్నికల్లో అనర్హుడిగా ప్రకటించలేము. పార్లమెంటులో చట్టం చేస్తే తప్ప.. అభ్యర్థుల అనర్హతపై నిర్ణయం తీసుకోలేము' అని తీర్పు చదివే సమయంలో సీజేఐ అన్నారు.
నేరారోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవాలని సుప్రీంకోర్టును మేము డిమాండ్ చేశాము. మా డిమాండ్‌ను విన్న అత్యున్నత న్యాయస్థానం.. పార్లమెంట్ చటాన్ని తీసుకురావాలంది' అని లాయర్ అశ్విని ఉపాధ్యాయ అన్నారు.
Parliament must ensure that criminals must not come to politics. No bar on criminal antecedents of political leaders, it's Parliament to make laws: CJI while reading out verdict on PIL seeking to disqualify candidates contesting polls after court frames charges against them. pic.twitter.com/aOT4L0PdmR
— ANI (@ANI) September 25, 2018
We had demanded from SC to ward off candidates from contesting polls against whom charges have been framed in heinous crimes. Validating our demand, SC has directed Parliament to pass a law that can stop criminalization of politics: Lawyer Ashwini Upadhyay pic.twitter.com/wsYsas4mkJ
— ANI (@ANI) September 25, 2018