Top Most Controversies In Sports: క్రీడల్లో వివాదాలు సహాజం. కొన్ని ఆట వరకే పరిమితం అయితే.. మరికొన్ని పెద్ద ఘర్షణలకే దారి తీస్తాయి. ఇలా జరగడం ప్రతి ఏడాది కామన్. మరీ ఈ సంవత్సరం క్రీడల్లో జరిగిన అతి పెద్ద వివాదాలు ఏంటి..? ఎలాంటి గొడవలు జరిగాయి..? ఓ లుక్కేయండి.
స్పానిష్ ఫుట్‌బాల్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ లూయిస్ రూబియల్స్ మెడల్ అందజేత సమయంలో మిడ్‌ఫీల్డర్ జెన్నిఫర్ హెర్మోసోను ముద్దుపెట్టుకోవడం వివాదస్పదంగా మారింది. రూబియాల్స్ను తొలగించాలని స్పెయిన్ ప్రధాన మంత్రి పెడ్రో శాంచెజ్‌ను ఆమె డిమాండ్ చేశారు. ఈ ఘటన తరువాత రూబియల్స్ క్షమాపణలు కూడా చెప్పారు.
ఆసియా క్రీడల్లో భారత్-ఇరాన్ మధ్య జరిగిన కబడ్డీ ఫైనల్ మ్యాచ్ రచ్చరచ్చ అయింది. మరో నిమిషంలో ఆట ముగుస్తుందనగా.. టీమిండియా రైడర్ పవన్ సెహ్రావత్ డూ ఆర్ డై రైడ్‌కు వెళ్లాడు. అయితే ఇరాన్ డిఫెండర్లను టచ్ చేయకుండా.. లాబీ మీదకు ఎంటర్ అయ్యాడు. ఈ క్రమంలో నలుగరు ఇరానీ డిఫెండర్లు కూడా లాబీలోకి ఎంటర్ అయి పవన్‌ను ఆపేందుకు ప్రయత్నించారు. లాబీలోకి ఎంటర్ అయిన ప్లేయర్లను ఔట్ పరిగణించాలని భారత్.. రైడర్ ఔట్ అని ఇరాన్ డిమాండ్ చేసింది. చివరకు పాత నిబంధనల ప్రకారం భారత్‌కు నాలుగు పాయింట్లు కేటాయించడంతో స్వర్ణం సొంతం చేసుకుంది.
అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారిగా 'టైమ్ అవుట్' ప్లేయర్‌గా శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ నిలిచాడు. వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక్క డెలివరీ ఎదుర్కొకుండానే మ్యాథ్యూస్ పెవిలియన్‌కు వెళ్లిపోయాడు.
డోపింగ్ నిరోధక కోడ్ ఉల్లంఘన కారణంగా రెండుసార్లు గ్రాండ్‌స్లామ్ విజేత సిమోనా హాలెప్‌పై నాలుగేళ్ల నిషేధం విధించినట్లు ఇంటర్నేషనల్ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ (ITIA) ప్రకటించింది.
మహిళా రెజ్లర్లపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ లైంగిక ఆరోపణలు ఈ ఏడాది జరిగిన అతి పెద్ద వివాదాల్లో ఒకటి. ఆయనను తొలగించాలని రెజ్లర్లు బజరుంగ్ పునియా, సాక్షి మాలిక్, ఇతర ఆటగాళ్లు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు.