Pallavi Prashanth Fans Attack: నిన్న పల్లవి ప్రశాంత్ అభిమానులు ప్రవర్తించిన తీరు…అసలు బుల్లితెర సెలబ్రెటీస్ పై అభిమానులకు ఉండేది అభిమానమా లేక శాడిజమా అన్నట్టుగా ప్రేక్షకులకు అనిపిస్తోంది. 100 ఎపిసోడ్ లకు పైగా జరిగిన బాస్ సీజన్ 7 నిన్నటితో ఫినాలే పూర్తి చేసుకుంది. కాగా దీంట్లో పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలవగా అమర్ దీప్ రన్నర్ గా నిలిచారు. అయితే ఈ ఫినాలే అయిపోయి ఇంటికి వెళ్లేటప్పుడు రన్నర్ అయిన అమర్ దీప్‌ని అతని ఫ్యామిలీని తరిమితరిమి కొట్టారు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్.
దాదాపు 100 మంది అల్లరి మూకల గుంపు అతని కారుపై ఒక్కసారిగా దాడి చేశారు. అరగంటకు పైగా కారులోనే ఉండిపోయిన అమర్ దీప్‌ని అతని ఫ్యామిలీని వెంటాడి వేటాడినట్టుగా దాడి చేసి.. వాళ్లని భయభ్రాంతుల్ని చేశారు పల్లవి ప్రశాంత్ అభిమానులు.
అమర్ దీప్ తో పాటు కారులో అతని భార్య.. తల్లి.. .. స్నేహితుడు నరేష్ లొల్ల.. డ్రైవర్ కూర్చుని ఉన్నారు. ఈ సంఘటన నిన్న ఆదివారం అర్థరాత్రి తరువాత.. అన్నపూర్ణ స్టుడియో నుంచి అమర్ దీప్.. ఆయన ఫ్యామిలీ కారులో.. బయటకు వస్తుండగా.. జరిగింది.
ఈ అల్లరి మూక అమర్ దీప్ ని బూతులు తిడితూ.. కారును అద్దాలను ధ్వంసం చేసి.. అమర్ దీప్‌ని బయటకు లాగే ప్రయత్నం చేశారు. కారులో ఉన్న అమర్ దీప్ తల్లి, భార్య తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వీరందరూ కూడా దాదాపు గంటసేపు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకున్నారు. అమర్ దీప్ అదేదో చేయరాని నేరం ఘోరం చేసినట్టుగా.. కారులో ఉన్న అమర్ దీప్‌ని అతని భార్యని బూతులు తిడుతూ సైకోలుగా బిహేవ్ చేశారు.
మరీ దారుణమైన విషయం ఏమిటి అంటే తనని వదిలేయండని అమర్ తల్లి.. స్నేహితుడు చేతులు జోడించినా అడిగిన వారు వినలేదు. కారుని పూర్తిగా ధ్వసం చేశారు. ఒకడైతే ఏకంగా కారు పైకి ఎక్కేసి.. నాట్యం చేసేశాడు.
కాగా వీరందరూ ఇంతలా ఓవరాక్షన్ చేయడానికి పెద్ద కారణం ఏమీ లేదు. అమర్ దీప్ కొన్ని బిగ్ బాస్ ఎపిసోడ్స్ లో విన్నర్ అయిన ప్రశాంత్‌ని తక్కువ చేసి మాట్లాడట. అతనితో హౌస్‌లో గొడవలు పట్టాడట. అది నచ్చకే అమర్ దీప్‌కి దాడి చేస్తున్నట్టు పలు యూట్యూబ్ ఛానల్స్‌తో బహిరంగంగానే ముందే చెప్పారు ప్రశాంత్ ఫ్యాన్స్. కానీ మరీ ఇంతలా అతి చేస్తారని ఎవరు ఊహించలేదు. మొత్తానికి ఈ సంఘటన తర్వాత పల్లవి ప్రశాంత్ విన్ అయ్యారు అమర్ దిప్ ఓడిపోయారు అనే భావన సాధారణ ప్రేక్షకుల్లో లేకుండా పోయింది.
Also Read: Tamil Nadu Road Accident: తమిళనాడులో కారు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ అయ్యప్ప భక్తులు మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook