Bank Salary Increase: దేశంలో బ్యాంకు ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి. బ్యాంకు యూనియన్లకు ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి.17 శాతం జీతం పెంపుకు ఐబీఏ సహా ఇతర బ్యాంకు యూనియన్లు అంగకీరించడమే కాకుండా ఎంవోయూ సైన్ చేశాయి.
బ్యాంకు ఉద్యోగులకు జీతాలు పెన్షనర్లకు పెన్షన్ పెరగనుంది. ఐబీఏ, యూనియన్లు ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 2022 నవంబర్ 1 నుంచి ఈ జీతాల పెంపు వర్తించనుంది. బేసిక్ ప్లస్ డీఏపై 3 శాతం ప్రయోజనం కలగనుంది. మరోవైపు 5 రోజుల పనిదినాలు అమల్లోకి రానున్నాయి. బ్యాంకు యూనియన్ల మధ్య ఏకాభిప్రాయం రావడంతో ఇక ఈ అంశం కేంద్ర ఆర్ధిక శాఖ నుంచి ఆమోదం పొందాల్సి ఉంది. పెన్షన్ స్కీమ్ రివిజన్ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్న పెన్షనర్లకు సైతం ప్రయోజనం కలగనుంది.
17 శాతం జీతం పెంపు విషయంలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌తో ఒప్పందం నేపధ్యంలో పెన్షన్ రివిజన్ కూడా ఆమోదమైంది. అయితే ప్రతి వారం శనివారం కూడా సెలవు విషయం ఇంకా పెండింగులో ఉంది. అయితే వారానికి 5 రోజుల పనిదినాలు కూడా త్వరగానే అమల్లోకి వస్తుందని ఏఐబీవోసీ తెలిపింది. 5 రోజుల పని హామీ, పెన్షన్ రివిజన్ విషయంలో ఏఐబీవోసీతో ఐబీఏకు అంగీకారం కుదిరింది. మొత్తానికి కేంద్ర ఆర్ధిక శాఖ నుంచి ఆమోదం లభిస్తే దేశవ్యాప్తంగా 8.50 లక్షలమంది బ్యాంకు ఉద్యోగులకు జీతాలు పెరగనున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook