Waxing tips: ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరికీ సౌందర్య సంరక్షణ పెరుగుతోంది. అందంగా ఉండాలని, నలుగురిలో ఆకర్షణీయంగా కన్పించాలని కోరుకుంటుంటారు. అందుకే చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఫలితంగా ఒక్కోసారి ఆ ప్రయత్నాలు వికటించి చర్మం పాడవుతుంటుంది. ఇందులో వ్యాక్సింగ్ ఒకటి. వ్యాక్సింగ్ ఇంట్లో చేసేటప్పుుడు చేసే కొన్ని పొరపాట్ల కారణంగా చర్మం తీవ్రంగా దెబ్బతింటుంది. ఏయే పొరపాట్లు చేయకూడదో తెలుసుకుందాం..
గోరు వెచ్చగా వ్యాక్స్ వ్యాక్స్ ఎప్పుడు చేసినా స్ట్రిప్ ను ఫాస్ట్ గా లాగకూడదు. నెమ్మది నెమ్మదిగా తొలగించాలి. వ్యాక్సింగ్ చేసేటప్పుడు గోరువెచ్చగా మాత్రమే ఉండేట్టు చూసుకోవాలి.
గాయాలు వ్యాక్స్ చేసేటప్పుడు చర్మంపై ఎక్కడైనా గాయం ఉందేమో చూసుకోవాలి. లేకపోతే గాయం తీవ్రమౌతుంది. చాలా సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.
వ్యాక్స్ పరీక్ష వ్యాక్స్ చేసేటప్పుడు ముందు ఏదైనా చిన్న భాగంలో పరీక్షించడం మంచిది. ఆ వ్యాక్స్ మీకు సెట్ అవుతుందో లేదా రియాక్షన్ ఇస్తుందో తెలిసిపోతుంది.
క్వాలిటీ వ్యాక్స్ వ్యాక్స్ చేసే సమయంలో మీరు ఉపయోగించే వ్యాక్స్ ఎలాంటిదో తెలుసుకోవాలి. కాలం చెల్లింది లేదా నాణ్యత లేని నాసిరకం వ్యాక్స్ వినియోగించకూడదు. దీనివల్ల చర్మం పాడవుతుంది.
సెన్సిటివ్ స్కిన్ వ్యాక్సింగ్ సరిగ్గా చేయకుంటే చర్మంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. చర్మానికి ఇన్‌ఫెక్షన్ సోకవచ్చు. మీ చర్మం సెన్సిటివ్ అయితే వ్యాక్సింగ్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. బలవంతంగా రుద్దడం, ఒత్డిడి కల్గించడం చేయకూడదు.