Cyclone Michaung Updates: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Telangana Rains: మిచౌంగ్ ఎఫెక్ట్‌తో తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి.  ఈశాన్య, తూర్పు దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు గాలులు వీస్తున్నాయి. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనివ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Dec 4, 2023, 06:43 PM IST
Cyclone Michaung Updates: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Telangana Rains: దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాలకు దగ్గరగా పశ్చిమ మధ్య దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం వద్ద కేంద్రీకృతమైన మిచౌంగ్ తుఫాను గంటకు 8 కి.మీ వేగంతో వాయువ్య దిశగా కదిలి క్రమంగా బలపడి తీవ్ర తుఫానుగా మారిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చెన్నైకి తూర్పు-ఈశాన్యంగా 90 కి.మీ, నెల్లూరుకు ఆగ్నేయంగా 170 కి.మీ, పుదుచ్చేరికి 200 కి.మీ ఈశాన్యంగా, బాపట్లకు 300 కి.మీ  దక్షిణ- ఆగ్నేయంగా మరియు  మచిలీపట్నానికి దక్షిణంగా 320 కి.మీ ఆగ్నేయంగా అదే ప్రాంతంలో వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది మరింత బలపడి  ఉత్తరం వైపు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి సమాంతరంగా కదులుతూ దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని మంగళవారం ఉదయం నెల్లూరు, మచిలీపట్నం మధ్య బాపట్లకు దగ్గరగా దాటే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈశాన్య, తూర్పు దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు గాలులు వీస్తున్నాయని చెప్పారు.

ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. మంగళవారం రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాల చోట్ల కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందన్నారు. 

కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రేపు రాష్ట్రంలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ అత్యంత భారీ   వర్షాలు, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలలో అక్కడక్కడ  భారీ నుంచి అతిభారీ వర్షాలు, జయశంకర్ భూపాలపల్లె, కరీంనగర్, పెద్దపల్లి, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాలలో అక్కడక్కడ  భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందన్నారు.

కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది. ఎల్లుండి పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లె, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఛాన్స్ ఉంది. 

Also Read: Abhiram Daggubati: దగ్గుబాటి అభిరామ్ పెళ్లి.. సురేష్ బాబు ఇంట మొదలైన సంబరాలు

Also Read: Vivo T2 Pro 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో బొనాంజా సేల్‌..Vivo T2 Pro 5Gపై రూ.22,550 వరకు ఎక్చేంజ్‌ బోనస్‌..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News