Horoscope 2023 December: జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరంలో నుంచి చివరి నెల ఎంతో ప్రత్యేకత కలిగి ఉంటుంది. ఎందుకంటే డిసెంబర్ నెలలో అనేక పెద్ద గ్రహాలు రాసి సంచారం చేయబోతున్నాయి. అంతేకాకుండా నక్షత్రాలు కూడా తమ రాశులను మార్చుకోబోతున్నాయి దీనికి కారణంగా 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. వచ్చేనెల డిసెంబర్లో శుక్రుడు సూర్యుడు బుధుడు బృహస్పతి కుజుడు ఒక రాసి నుంచి మరో రాశికి సంచారం చేయబోతున్నాయి. ఈ ఐదు గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా మరికొన్ని రాశుల వారికి తీవ్ర దుష్ప్రభావాలు కలిగే ఛాన్సులు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అయితే ఈ గ్రహాల సంచారం కారణంగా డిసెంబర్ నెలలో ఏయే రాశుల వారికి ఎలా ఉండబోతోంది. ఏయే గ్రహాలు ఎప్పుడు సంచారం చేయబోతున్నాయి. మనం ఇప్పుడు తెలుసుకుందాం.
శుక్ర గ్రహ సంచారం:
డిసెంబర్ 25వ తేదీన శుక్రుడు వృశ్చిక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఈ గ్రహం ఉదయం 6:33 నిమిషాల నుంచి తన గమనాన్ని ప్రారంభించబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారి వ్యక్తిగత జీవితాల్లో ఊహించని మార్పులు వస్తాయి.
సూర్య గ్రహ సంచారం:
సూర్య గ్రహ సంచారం డిసెంబర్ 16వ తేదీన జరగబోతోంది. సూర్యుడు ధనస్సు రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా ఒక నెలపాటు ఇదే రాశులు ఉండబోతున్నాడు. దీంతో కొన్ని రాశుల వారికి నెలపాటు ఊహించని లాభాలతో పాటు నష్టాలు కూడా కలుగుతాయి.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
బుధ గ్రహ సంచారం:
డిసెంబర్ 13వ తేదీన బుధ గ్రహ సంచారం జరగబోతోంది. అయితే బుధుడు రాశి సంచారం తీరోగమన దిశలో చేయబోతున్నాడు. ఆ తర్వాత డిసెంబర్ 28వ తేదీన ఈ గ్రహ కదలికల్లో మార్పులు చేర్పులు కాబోతున్నాయి. బుధుడు నేరుగా వృశ్చిక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కూడా కొన్ని రాశులు వారిపై ప్రభావం పడుతుంది.
గురు గ్రహ సంచారం:
ఈ సంవత్సరం చివరి నెలలో గురుగ్రహం కూడా సంచారం చేయబోతోంది ఈ సంచారం డిసెంబర్ 31వ తేదీన జరగబోతోంది. దీని కారణంగా కూడా కొన్ని రాశుల వారి వ్యక్తిగత జీవితాల్లో మార్పులు రాబోతున్నాయి. ఈ సంచారం శుభప్రదంగా ఉంటే, మరి కొన్ని రాశుల వారికి దుష్ప్రభావాలను కలిగించవచ్చు.
అంగార గ్రహ సంచారం:
డిసెంబర్ 27వ తేదీన జ్యోతిష్య శాస్త్రం ఎంతో ప్రాముఖ్యత కలిగిన అంగారక గ్రహం ధనస్సురాశిలోకి సంచారం చేయబోతోంది. ఈ సంచారం రాత్రి 11 గంటలకు ప్రారంభం కాబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఊహించని నష్టాలతో పాటు లాభాలు కలిగి ఛాన్స్ కూడా ఉంది.
డిసెంబర్ నెల అదృష్ట రాశి చక్రాలు:
ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో కొన్ని గ్రహాల సంచారాల కారణంగా ఐదు రాశుల వారు మంచి అదృష్టాన్ని పొందుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మారుతున్న గ్రహాలు కదలిక కారణంగా డిసెంబర్ నెలలో ధనస్సు, వృషభ, తుల, మకర రాశి వారు ఊహించని లాభాలు పొందబోతున్నారు. అంతే కాకుండా ఈ రాశుల వారికి ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే వీరు ఈ సమయంలో ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Horoscope 2023 December: డిసెంబర్ నెలలో జరిగే గ్రహాల సంచారాలు ఇవే..5 రాశులవారికి విపరీతమైన లాభాలు!