Cardamom Leaves Benefits: ఏలకులను తరచుగా మౌత్ ఫ్రెషనర్‌గా వినియోగిస్తారు. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు శరీరానికి అనేక రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి. అయితే ఏలకుల కాదు, మనం బయట తీసి పడేసే వాటి పీల్స్ కూడా శరీరానికి చాలా రకాల లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెపుతున్నారు. వీటిలో ఉండే గుణాలు జీర్ణవ్యవస్థకు, కళ్లు, మెదడుకు మేలు చేస్తాయి. అంతేకాకుండా ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అయితే ఏలకుల ఫీల్స్‌ను ప్రతి రోజు వినియోగించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఏలకుల ఫీల్స్ వల్ల కలిగే ప్రయోజనాలు:
ఏలకులు పీల్స్ మూడ్ ఫ్రెషనర్‌గా కూడా పని చేస్తాయి. ఇందులో ఉండే గుణాలు నోటి దుర్వాసనను దూరం చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు రక్తాన్ని శుద్ధి చేసేందుకు కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా వీటిలో ఉండే డైజెస్టివ్ ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
వికారం సమస్యలకు చెక్:
ప్రస్తుతం చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల వికారం సమస్య వంటి సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఏలకుల తొక్కలతో తయారు చేసిన పౌండర్‌ను భోజనం తర్వాత తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ
మెరుగైన జీర్ణవ్యవస్థ కోసం:
ప్రస్తుతం చాలా మంది అతిగా నూనె, మసాల కలిగిన ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటోంది. దీని కారణంగా పొట్ట నొప్పి, మలబద్దకం, పొట్ట తిప్పడం వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు రోజు తీసుకునే ఆహారాల్లో ఏలకుల తొక్కలతో తయారు చేసిన చూర్ణాన్ని ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
ఎసిడిటీ సమస్యలకు చెక్:
మార్కెట్‌లో రకాల రకాల ఏలకులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా చిన్న ఏలకులను క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల ఎసిడిటీ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు తీవ్ర పొట్ట సమస్యలు కూడా దూరమవుతాయి. తరచుగా అనారోగ్య సమస్యలో బాధపడేవారు తప్పకుండా యాలకుల చూర్ణాన్ని వినియోగించాలి.
Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Cardamom Leaves Benefits: డైజెస్టివ్ సమస్యలతో బాధపడేవారికి అద్భుతు చిట్కా..రోజు ఇలా చేయండి..