IPL 2024: ఐపీఎల్ 2024కు ముందే డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు షాక్ తగిలింది. తమ స్టార్ ఆటగాడు జట్టుకు దూరమయ్యాడని చెన్నై సూపర్‌కింగ్స్ స్వయంగా ప్రకటించింది. ఎవరా ఆటగాడు, ఎందుకు జట్టుకు దూరమౌతున్నాడో తెలుసుకుందాం..
ఐపీఎల్ 2024 మెగా వేలం ఈసారి దుబాయ్‌లో డిసెంబర్ 19న జరగనుంది. అంతకంటే ముందే అంటే రేపటిలోగా వివిధ ఫ్రాంచైజీలు రిటెన్షన్ జాబితాను వెల్లడించాల్సి ఉంటుంది. ఈలోగా చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు నుంచి తప్పుకుంటున్నట్టు ఆ జట్టు ఆల్‌రౌండర్ స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ ప్రకటించాడు. చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. వాస్తవానికి గత ఐపీఎల్ సీజన్లో బెన్ స్టోక్స్ కేవలం రెండే మ్యాచ్‌లు ఆడాడు. చీలమండ గాయం కారణంగా మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇప్పుడు పని ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఐపీఎల్ ఆడకూడదని బెన్ స్టోక్స్ నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ఐపీఎల్ కంటే ముందు ఇండియాలో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, 2024లో టీ20 ప్రపంచకప్ ఆడాల్సి ఉంది.
ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ని చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు ఏకంగా 16.25 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. కానీ ఆ జట్టుకు బెన్ స్టోక్స్ న్యాయం చేయలేకపోయాడు. బెన్ స్టోక్స్ ఐపీఎల్లో ఇప్పటివరకూ 45 మ్యాచ్‌లు ఆడగా అందులో 2 హాఫ్ సెంచరీలు, 2 సెంచరీలున్నాయి. 935 పరుగులు చేశాడు. 28 వికెట్లు పడగొట్టాడు. ఇండియాతో టెస్ట్ సిరీస్ కంటే ముందే మోకాలి శస్త్ర చికిత్స చేయించుకోనున్నాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook