Anasuya: అలా చేయకపోవడం వల్లే హీరోయిన్ కాలేకపోయా.. అనసూయ సెన్సేషనల్ కామెంట్స్

Anasuya about Pawan Kalyan film: సినిమాలకన్నా కూడా తన సోషల్ మీడియా పోస్టులు అలానే ఇంటర్వ్యూల ద్వారా ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది అనసూయ. కాగా జబర్దస్త్ షో తో తెలుగువారికి పరిచయమైన అనసూయ తన అందం అలానే అభినయంతో ఎంతోమందిని ఫిదా చేసింది. ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటూ వెండి తెర లో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ వెళుతుంది. ఈ నేపథ్యంలో తను హీరోయిన్ ఎందుకు కాలేకపోయానని.. అలానే తను పవన్ కళ్యాణ్ సినిమా సైతం ఎందుకు వదులుకున్నాను అని అనసూయ చెప్పిన జవాబులు వైరల్ అవుతున్నాయి..  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 5, 2023, 03:52 PM IST
Anasuya: అలా చేయకపోవడం వల్లే హీరోయిన్ కాలేకపోయా.. అనసూయ సెన్సేషనల్ కామెంట్స్

Anasuya Bharadwaj: జబర్దస్త్ షో తో పరిచయమైన అనసూయ.. బుల్లితెర యాంకర్స్ లో అప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసింది. జబర్దస్త్ షోలో అనసూయని చూసిన వారందరూ ఈమె హీరోయిన్ లాగా ఉంది అంటూ కామెంట్లు చేశారు. అంతేకాదు అప్పట్లో అనసూయ కోసమే జబర్దస్త్ షో చూసిన వాళ్లు కూడా ఎంతోమంది ఉన్నారు అన్నడంలో అతిశయోక్తి లేదు.

ఇక ఆ షో తో పాపులర్ అయిన అనసూయ ఆ తరువాత బుల్లితెరకు విరామం తీసుకొని వెండితెర పైకి వచ్చేసింది. ఐటమ్ సాంగ్స్ లో అలానే కొన్ని సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా అనసూయ రంగస్థలం సినిమాలో చేసిన రంగమ్మత్త క్యారెక్టర్ కి అప్పుడు అందరూ ఫిదా అయిపోయారు. కాగా అనసూయ కి హీరోయిన్ గా మాత్రం పెద్దగా ఛాన్సులు రాలేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మాత్రమే అనసూయ పేరు తెచ్చుకోగలిగింది. 

అందం, అభినయం ఉన్నా కానీ అనసూయ కి హీరోయిన్ క్యారెక్టర్లు మాత్రం రాకపోవడానికి ఒక కారణం ఉందట. తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో తాను హీరోయిన్‌గా అవ‌కాశాలు అందుకోకపోవడానికి కార‌ణ‌మేంటో చెప్పింది అన‌సూయ‌. ఇక తను చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ విషయంపై అనసూయ స్పందిస్తూ..' ఏదైనా సినిమా ఒప్పుకుంటే ఆ సినిమా షూటింగ్స్‌లో నా ప‌ని నేను చేసుకుని వెళ్లిపోతుంటాను. ముఖ్యంగా సినిమా అయ్యాక జ‌రిగే పార్టీల‌కు నేను దూరంగా ఉంటాను. ఈ కారణం వల్లనే నేను క‌థానాయిక‌గా అవ‌కాశాలు కోల్పోయాను' అంటూ ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేసింది. అలాంటి పార్టీల‌కు వెళ్తేనే అవ‌కాశాలు వ‌స్తాయంటే వాటిని నేను ఎంక‌రేజ్ చేయ‌ను అని కూడా చెప్పేసింది ఈ నటి.

ఇక దీంతో పాటు తాను పవన్ కళ్యాణ్ సినిమాని కూడా ఒప్పుకోకపోవడానికి కారణం చెప్పుకొచ్చింది.
'అత్తారింటికి దారేది సినిమాలో ఒక పాట‌లో నటించమని నన్ను అడిగారు కానీ నేను వేరే అమ్మాయిల మ‌ధ్య డాన్స్ చేస్తే నాకు గుర్తింపు రాద‌న్న ఉద్దేశంతో ఆ అవ‌కాశాన్ని తిర‌స్క‌రించాను.. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాకే నో చెబుతావా అని నన్ను అప్ప‌ట్లో చాలా ట్రోల్ చేశారు' అని చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం అయితే తన మనస్తత్వం అలా లేదని.. ఒక‌ప్ప‌ట్లా త‌న పాత్ర‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉండాల‌ని అనుకునేదాన్ని కానీ ఇప్పుడు మాత్రం ఎలాంటి పాత్ర‌తోనైనా గుర్తింపు తెచ్చుకోగ‌ల‌న‌నే న‌మ్మ‌కం క‌లిగింద‌ని.. తెలియజేసింది అనసూయ.

Also Read: IND Vs SL Highlights: శ్రీలంకకు టీమిండియా అదిరిపోయే పంచ్.. సెమీస్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ..!  

Also Read: Skin Care Tips: ఈ పదార్ధాలు దూరం చేయకుంటే మీ చర్మం కాంతి విహీనంగా అందవికారంగా మారడం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News