CM Jagan Speech at YSR Awards Ceremony: ఎందరో మహానుభావులు అందరికీ ఈ శుభ సందర్భంలో వందనాలు. ఈ రోజు ఇక్కడ మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన గౌరవనీయులు గవర్నర్ గారికి, నా మంత్రివర్గ సహచరులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సన్మాన స్వీకర్తలు, వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రజలందరికీ ముందుగా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ అవతరించి నేటికి 67 సంవత్సరాలైంది. వరుసగా ఈ రోజుకు లెక్కేసుకుంటే ఇది మూడో సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. మన రాష్ట్రాన్ని వివిధ రంగాల్లో దశాబ్దాలుగా సుసంపన్నం చేసిన మహనీయులను గౌరవిస్తూ వైయస్సార్ అవార్డులతో సత్కరించే ఈ సంప్రదాయం మూడు సంవత్సరాలుగా చేస్తున్నాం. మన సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ వివిధ రంగాల్లో ఎంతగానో ఎదిగినా సామాన్యులుగా ఎదిగిన అసామాన్యులకు ఇస్తున్న అవార్డులు ఇవి.
ఈ సంవత్సరం 27 మందికి వైయస్సార్ అవార్డులతో సత్కరిస్తున్నాం. ఇందులో నలుగురికి అచీవ్‌మెంట్, 23 మందికి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు ప్రదానం చేయబోతున్నాం. తెలుగు తనానికి, తెలుగు మాటకు, తెలుగు వాడి గుండె ధైర్యానికి మన పల్లెలు, మన పేదలు, మన రైతుల మీద మమకారానికి, మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపం డాక్టర్ వైయస్సార్ గారి పేరిట రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత అవార్డులు ప్రదానం చేస్తున్నాం. వైయస్సార్ గారి హయాంలో వ్యవసాయం, విద్య, వైద్యం, గృహ నిర్మాణం ఇలా ఏ రంగాన్ని తీసుకన్నా అంతకు ముందున్న చరిత్ర గతిని మారుస్తూ ఎన్నో ముందడుగులు పడిన పరిస్థితులు మనమంతా చూసినవే.
Also Read: Boat Blitz 1500 Price: బిగ్ దీపావళి సేల్‌లో boAt Blitz 1500 హోమ్ థియేటర్‌పై 42 శాతం తగ్గింపు!
ఇలాంటి రంగాల్లోనే మన వ్యవసాయానికి, మన చేనేతకు, మన తప్పెటగూళ్లకు, మన జానపదానికి, మన రంగస్థలానికి, మన అభ్యుదయ వాదానికి, హేతు వాదానికి సాటి మనుషులకు చేస్తున్న సేవలకు ఇలా పలు రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న గొప్ప వ్యక్తులకు ఈ ఏడాది అవార్డుల్లో చోటు దక్కింది. వారి జీవితాన్ని అర్పించిన వారు మన హెరిటేజ్‌ను తమ భుజాల మీద మోసిన వారు.. వీరంతా మన జాతి సంపద. ఈ రోజు సమాజం ఇచ్చిన గుర్తింపు ఆధారంగా ప్రదానం చేస్తున్న ఈ అత్యున్నత అవార్డుల్లో చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఈ మూడు సంవత్సరాల్లో సామాజిక న్యాయం వర్ధిల్లింది. ఈ వార్డులు అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ గవర్నర్ గారిని ప్రసంగించాల్సిందిగా విన్నవిస్తున్నానని సీఎం జగన్ పేర్కొన్నారు.
Also Read: Varun Tej Wedding: మెహందీ ఫంక్షన్ లో మెరిసిపోయిన వరుణ్-లావణ్య జంట..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి