Iqoo 12 Price: యువత ఎక్కువగా గేమింగ్ స్మార్ట్ ఫోన్స్ ను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా దీనిని దృష్టిలో పెట్టుకొని గేమింగ్స్ స్మార్ట్ ఫోన్ తయారు చేసేందుకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. ప్రస్తుతం iQOO మొబైల్స్ బ్రాండ్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ లకు పెట్టింది పేరు. అయితే ఈ కంపెనీ అతి త్వరలోనే మరో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ అనేక రకాల అధునాతన ఫీచర్లతో రాబోతోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ఫీచర్లు, ధర మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఐక్యూ కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ iQOO 12 పేరుతో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ నవంబర్ 7వ తేదీన విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ లాంచింగ్ తేదీకి సంబంధించిన అధికారిక సమాచారం మాత్రం కంపెనీ ఇప్పటికీ వివరించలేదు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన ఫీచర్ల వివరాల్లోకి వెళ్తే..iQOO 12 స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌తో వస్తుందని కంపెనీ తెలిపింది. ఈ మొబైల్ ఇంతకుముందు మార్కెట్లోకి విడుదల చేసిన ఐక్యూ స్మార్ట్ ఫోన్స్ మోడల్స్ ని కలిగి ఉంటుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో రాబోతున్నట్లు తెలుస్తోంది. మొదటిది బేస్ వేరియంట్ అయితే, రెండవది ప్రో వేరియంట్లో రాబోతున్నట్లు కంపెనీ పేర్కొంది.
Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడంటే..?
ఇక ఈ iQOO 12 స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన ప్రాసెసర్ విషయానికొస్తే..డెడికేటెడ్ డిస్‌ప్లే ప్రాసెసర్ ను కలిగి ఉంటుందని సమాచారం. మొదట ఈ స్మార్ట్ ఫోన్ చైనాలో ప్రారంభించిన తర్వాతే ఇతర దేశాల్లో ప్రారంభించబోతున్నట్లు కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ హార్డ్‌వేర్ యాక్సిలరేటెడ్ రే ట్రేసింగ్ ఫీచర్‌తో రాబోతోంది. దీంతోపాటు ఈ మొబైల్ అల్ట్రా-రియలిస్టిక్ లైటింగ్, రిఫ్లెక్షన్, అధునాతన గేమింగ్ ఫీచర్స్ తో రాబోతున్నట్లు తెలుస్తోంది.
iQOO 12 స్మార్ట్ ఫోన్ ఫీచర్స్:
6.7 అంగుళాల E7 AMOLED డిస్‌ప్లే
డిస్ప్లే 1.5K రిజల్యూషన్
144Hz రిఫ్రెష్ రేట్
LED ఫ్లాష్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
50-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా
50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా
64-మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ కెమెరా
120 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
1 TB ఇంటర్నల్ స్టోరేజ్
Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook