Diwali 2023: దీపావళికి ముందు ఈ 2 గ్రహాల గమనంలో పెను మార్పు.. ఈ 4 రాశులపై డబ్బు వర్షం..

Diwali 2023: దీపావళికి ముందు శుక్రుడు, శని గమనంలో పెను మార్పు రాబోతుంది. ఈ రెండు గ్రహాల సంచారం నాలుగు రాశులవారి జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురానుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 21, 2023, 08:23 PM IST
Diwali 2023: దీపావళికి ముందు ఈ 2 గ్రహాల గమనంలో పెను మార్పు.. ఈ 4 రాశులపై డబ్బు వర్షం..

Shani Shukra Gochar 2023 in November: ఆస్ట్రాలజీలో ఒక్కో  గ్రహానికి ఒక్కో  ప్రత్యేకత ఉంటుంది. ఐశ్వర్యం మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడిగా శుక్రుడిని భావిస్తారు. మరోవైపు మనం చేసే మంచి  చెడులను బట్టి ఫలితాలను ఇస్తాడు శని. అందుకే ఇతడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. శని అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. 

నవంబరులో శుక్రుడు, శని గ్రహాల గమనంలో పెను మార్పు రాబోతుంది. నవంబరు 03న శుక్ర గ్రహం సింహరాశిని వదిలి కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత రోజున అంటే నవంబరు 04న శని నేరుగా నడవనున్నాడు. శని మరియు శుక్రుడి గమనంలో మార్పు దీపావళికి ముందు నాలుగు రాశులవారి జీవితాల్లో వెలుగులు నింపనుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 

మిథునం: శని, శుక్ర సంచారం మిథునరాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. 
మకరం: దీపావళికి ముందు శుక్ర, శని గమనంలో మార్పు మకరరాశి వారికి ఊహించని లాభాలను ఇస్తుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. 
మేషం: శుక్రుడు, శని సంచారం మేషరాశి వారికి అనుకూలంగా ఉండనుంది. మీరు కెరీర్‌లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీ సంపద రెట్టింపు అవుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ జీవితంలో సంతోషం వెల్లివిరిస్తుంది. 
వృషభం: దీపావళికి ముందు వృషభరాశి వారికి లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. 

Also Read: Rahu Gochar 2023: దసరా తర్వాత ఈ మూడు రాశులకు తిరుగుండదు.. మీది ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News