Surya Grahan 2023 Impact: 2023 సంవత్సరంలో రెండవ, చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 14 ఏర్పడబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్యగ్రహణాన్ని పవిత్రమైన సంఘటనగా భావిస్తారు. కానీ ఈ సమయంలో ఏ శుభకార్యమైనా నిషేధించడం ఆనవాయితిగా వస్తోంది. దీంతో పాటు అన్ని దేవాలయాలు కూడా ఈ సమయంలో మూసివేస్తారు. ఈ చివరి సూర్యగ్రహణం ఇండియన్ టైమ్ ప్రకారం.. రాత్రి 08:34 గంటలకు ప్రారంభమై, తెల్లవారుజామున 02:25 గంటలకు ముగుస్తుంది. అయితే ఈ ప్రభావం కొన్ని రాశులవారిపై సానుకూల ప్రభావాన్ని చూపితే మరికొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ గ్రహణం ఏయే రాశులవారిపై ప్రభావం చూపుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మిథున రాశి:
ఈ చివరి సూర్యగ్రహణం మిథునరాశి వారికి శుభప్రదంగా మారుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో మనస్సు ప్రశాంతంగా మారుతుంది. అంతేకాకుండా కెరీర్లో గొప్ప విజయాలు కూడా సాధిస్తారు. మానసిక ప్రశాంతత కూడా మెరుగుపడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఆర్థికంగా కూడా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
సింహ రాశి:
అక్టోబర్ 14న ఏర్పడబోయే సూర్యగ్రహణం సింహరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉండబోతోంది. ఈ సమయంలో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. వీరు కుటుంబంతో ఆనందంగా కూడా గడుపుతారు. ఈ సమయంలో శత్రువులు మీకు హాని కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
తుల రాశి:
సూర్యగ్రహణం తులారాశి వారికి మంచి ఫలితాలను అందిచబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా సమాజంలో మీ స్థాయి కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా నెరవేరుతాయి. వ్యాపారులు చేసేవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా నెరవేరుతాయి.
మకర రాశి:
ఈ సమయంలో మకర రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఖర్చులు కూడా పెరుగుతాయి. దీంతో పాటు ఆర్థికంగా కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. దీంతో మీరు ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా భవనాలు కూడా వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి