8th Pay Commission Latest Updates: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం కింద జీతాలు అందుతున్నాయి. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో 8వ వేతన సంఘాన్ని అమలు చేయాలనే డిమాండ్ నెరవేరుతుందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 8వ వేతన సంఘంపై అన్నింటా చర్చ జరుగుతున్నా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సాధారణంగా పాత పే కమిషన్ 10 సంవత్సరాలు పూర్తయితే.. ప్రభుత్వం కొత్త పే కమిషన్‌ను ప్రతిపాదిస్తుంది. ఈ లెక్కన 7వ వేతన సంఘం 2014లో అమలు చేశారు. అంటే వచ్చే ఏడాదికి పదేళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలోనే 2024లో కొత్త పే కమీషన్‌ను ప్రకటించవచ్చని చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు నమ్మకంతో ఉన్నారు.
వచ్చే ఏడాది పార్లమెంట్‌తోపాటు చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల జరగనుండడంతో గుడ్‌న్యూస్ వస్తుందని నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. ఎన్నికల ప్రారంభానికి ముందే ప్రభుత్వం 8వ వేతన సంఘం అమలుతో తమను ఆశ్చర్యపరుస్తుందని కేంద్ర ఉద్యోగులు భావిస్తున్నారు. 1 జనవరి 2023 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రాథమిక వేతనంపై 42 శాతం డియర్‌నెస్ అలవెన్స్‌ను పొందుతున్నారు. 7వ వేతన సంఘం ప్రకారం.. ప్రభుత్వం ఉద్యోగుల డీఏను సంవత్సరానికి రెండుసార్లు పెంచాలి. ఈ ఏడాది రెండో డీఏ కూడా 4 శాతం పెంచితే.. 46 శాతానికి చేరుకుంటుంది.
ఉద్యోగుల బేసిక్ శాలరీపై ప్రభుత్వం గరిష్టంగా 50 శాతం డీఏను మాత్రమే అందిస్తుంది. 50 శాతం దాటితే.. బేసిక్ శాలరీలో ప్రభుత్వం పే కమీషన్‌ను సవరిస్తుంది. 8వ పే కమిషన్‌ను అమలు చేస్తుంది. దీని తరువాత కేంద్ర ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్సులు సున్నా నుంచి అందిస్తుంది. ప్రస్తుతం లెక్కల ప్రకారం వచ్చే ఏడాది జనవరి డీఏ పెంపునకు డీఏ 50 శాతం దాటే అవకాశం ఉంది.
8వ వేతన సంఘంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కొత్త వేతనాన్ని లెక్కించే సమయంలో అనేక అంశాలు అమలు చేస్తారు. బేసిక్ శాలరీలో ప్రభుత్వ ఉద్యోగుల పే స్కేల్‌ను అప్‌గ్రేడ్ చేయడం కూడా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రాథమిక జీతం, అన్ని అలవెన్సులతో కలిపి కనీసం 18 వేల నెలవారీ జీతాలు పొందుతున్నారు. కానీ కొత్త పే కమిషన్‌ను ప్రకటించిన తర్వాత ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కూడా పెరుగుతుంది. కాబట్టి వారి ప్రాథమిక వేతనాన్ని ఫార్ములా ప్రకారం పెంచుతారు. ఉదాహరణకు ఒక ఉద్యోగి అయితే రూ.18 వేలు అయితే.. కొత్త ఫార్ములా ప్రకారం నెలకు 26 వేల రూపాయలు పొందవచ్చు. దీని తరువాత డియర్‌నెస్ అలవెన్సులు, ఇతర అలవెన్సులు బేసిక్ జీతం లెక్కిస్తారు.
Also Read: MP Bandi Sanjay: ఖబడ్డార్ ట్విట్టర్ టిల్లు.. మంత్రి కేటీఆర్‌కు బండి సంజయ్ వార్నింగ్
Also Read: Health Tips in Telugu: పాలలో ఖర్జూరం మరగబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. ఒక్కసారి తీసుకుంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్.. త్వరలోనే ప్రకటన..!