yendira ee panchayithi: అక్టోబర్ 6న రాబోతోన్న ఫీల్ గుడ్ మూవీ 'ఏందిరా ఈ పంచాయితీ'

Tollywood: విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న చిత్రాలకు టాలీవుడ్ లో మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా ఈ కోవలోనే ‘'ఏందిరా ఈ పంచాయితీ'’ అనే సినిమా రాబోతుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 27, 2023, 01:45 PM IST
yendira ee panchayithi: అక్టోబర్ 6న రాబోతోన్న ఫీల్ గుడ్ మూవీ 'ఏందిరా ఈ పంచాయితీ'

yendira ee panchayithi Movie: గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలకు ఈ మధ్య కాలంలో విశేషాదరణ లభిస్తోంది. బలగం, ఇంటింటి రామాయణం, భీమదేవర పల్లి వంటి చిత్రాలే ఇందుకు ఉదాహరణ. బలగం మూవీ అయితే  జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను సైతం దక్కించుకుంది. తాజాగా ఇలాంటి విలేజ్ బ్యాక్ డ్రాప్ తోనే వస్తున్న ప్రేమ కథా చిత్రం 'ఏందిరా ఈ పంచాయితీ'’. ఈ మూవీతో గంగాధర.టి దర్శకుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. భరత్, విషికా లక్ష్మణ్‌లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మిస్తున్నారు. ఇప్పటికీ రిలీజైన టైటిల్ లోగో, గ్లింప్స్, పాటలకు ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 

ఇటీవల విడుదల చేసిన టీజర్ సైతం అందరినీ ఆకట్టుకుంది. సునీత పాడిన పాట అయితే అందరినీ కదిలించింది. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ మీద వచ్చిన ఆ పాట అందరినీ మెప్పించింది. ఇలా ప్రతీ విషయంలో సినిమా మీద ఆసక్తిని పెంచేలా ప్రమోషన్స్ చేసింది యూనిట్. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రాన్ని అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి పీఆర్ (పెద్దపల్లి రోహిత్) సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సతీష్ మాసం కెమెరామెన్‌గా, జేపీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల ఈ చిత్రానికి మాటలు అందించారు. కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News