SUV Market: ఎస్‌యూవీ మార్కెట్‌లో ఇప్పుడీ కారు మిగిలిన అన్ని కార్లను వెనక్కి నెట్టేసింది. హ్యుండయ్ క్రెటా, టాటా నెక్సాన్ అన్నింటినీ దాటుకుని దూసుకెళ్తోంది. ధర కూడా మిగిలినవాటితో పోలిస్తే తక్కువే. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
SUV Market: ఆగస్టు నెల ఎస్‌యూవీ అమ్మకాల్లో హ్యుండయ్ క్రెటా, టాటా నెక్సాన్ కంటే మారుతి బ్రిజా ముందంజలో ఉంది. కేవలం 8.29 లక్షల ఖరీదైన ఈ కారు ఆగస్టులో 14,572 యూనిట్ల విక్రయాలు నమోదు చేసింది.
ఇక ధర విషయంలో కూడా మారుతి బ్రిజా ధర తక్కువే. దీని ధర 8.29 లక్షల నుంచి ప్రారంభమై, 14.14 లక్షల వరకూ ఉంటుంది.
మారుతి బ్రిజా మైలేజ్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇది లీటరుకు 20.15 కిలోమీట్లు ఇస్తుంది. అదే సీఎన్జీ అయితే లీటర్‌కు 25.51 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
మారుతి బ్రిజాలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 5 ఎంటీ, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్‌తో వస్తోంది. ఇది 101 పీఎస్ పవర్, 136 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇందులో సీఎన్డీ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.
కొత్త మారుతి బ్రిజాలో సేఫ్టీ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ , హిల్ హోల్డ్ అసిస్ట్, రేర్ పార్కింగ్ సెన్సార్ ఉంటాయి.
మారుతి బ్రిజాను 6 మోనోటోన్, 3 డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో విక్రయిస్తున్నారు. ఇది 5 సీటర్ ఎస్‌యూవీ విత్ 328 లీటర్ బూట్ స్పేస్ కావడంతో అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇక ఫీచర్ల గురించి మాట్లాడితే 9 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 4 స్పీకర్, సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, 360 డిగ్రీ కెమేరా ఉన్నాయి.