Egypt Treasure: ఈజిప్టు సముద్రంలో పరిశోధకులకు భారీ ఖజానా లభ్యమైంది. యూరోపియన్ ఇనిస్టిట్యూట్ ఫర్ అండర్ వాటర్ ఆర్కియాలజీ పరిశోధకులు ఈజిప్టు సముద్రతీరంలోని ఓ ప్రాంతంలో భారీ ఖజానాతో పాటు కొన్ని రహస్య వస్తువుల్ని అణ్వే,షించి తీశారు.
Egypt Treasure: ఈజిప్టులో ఈ పరిశోథకులు వెలికి తీసిన ఖజానా, ఇతర వస్తువులన్నీ మునిగిపోయిన ఓ ఆలయానికి చెందినవిగా పరిశోథకులు వెల్లడించారు. ఈ పోర్ట్ సిటీ అణ్వేషణకు విశేష ప్రాధాన్యత లభిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం..
మందిరంలోని తూర్పు భాగంలో ఫిరౌన్ చక్రవర్తి కాలంలో ఆరాధించే దేవీ దేవతలు విగ్రహాలు లభ్యమయ్యాయి.
ఈ వస్తువులతో పాటు ఈజిప్టు సముద్రంలో కుబేరుడి ఖజానా బయటపడింది. అందులో వజ్ర వైఢూర్యాలు, మణి మాణిక్యాలు అన్నీ ఉన్నాయి. వీటి విలువ ప్రస్తుతానికి లెక్కించలేకపోతున్నారు.
క్రీస్తుపూర్వం 5వ శతాబ్దానికి చెందిన నాణ్యమైన కలపతో చేసిన స్థంభాలు సురక్షితంగా లభ్యమయ్యాయి.
మందిరం వెలికితీతతో చాలా విలువైన వస్తువుల గురించి తెలిసింది. పూజాది కార్యక్రమాల్లో వినియోగించే వెండి పరికరాలు, బంగారు ఆభరణాలు, అత్తరు కంటైనర్లు లభించాయి. ఈ సంపద చాలా విలువైందిగా తెలుస్తోంది. వేలాది సంవత్సరాల క్రితం ఈ పోర్ట్ సిటీలో ఉండే ప్రజలు ఆధ్యాత్మికత గురించి కూడా ఈ పరిశోధనతో తెలిసింది.
దక్షిణ ప్రాంతంలో జరిపిన పరిశోధనలో ఓ ప్రాచీన మందిరానికి చెందిన రాతి భాగాలు లభ్యమయ్యాయి. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో జరిగిన ఓ ప్రళయంలో ఇది నీట్లో మునిగిపోయందని తెలుస్తోంది. దీనిని అమూన్ దైవ మందిరంగా భావిస్తున్నారు.