బరువు తగ్గటానికి, జీవక్రియ మెరుగుపరుచుకోటానికి అల్లోపతి మందులను వాడే బదులు ఇంట్లో ఉండే సహాయ ఔషధాలను వాడటం చాలా మేలు. ఎందుకంటే వీటి వలన ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవు. వీటి వలన ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా.. అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి.
ఈ మధ్యకాలంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలకైనా అల్లోపతి మందులు వాడుతున్నారు. దీని వలన ఆరోగ్య సమస్యలకు తగ్గటం కాకుండా.. వేరే ఇతర సమస్యలు కూడా మొదలవుతాయి. జీలకర్ర - సోంపు మిశ్రమం తాగటం వలన అనేక సమస్యలు తగ్గటమే కాకుండా.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లుండవు.
అధిక బరువు తగ్గించుకోవడానికి లక్షల ఉపాయాలను పాటించడం కన్నా జీలకర్ర - సొంపు జ్యూస్ తాగితే చాలు. ఈ సహజ డిటాక్స్ జ్యూస్ తాగితే చాలా రకాల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఈ మిశ్రమం తాగితే కొద్దీ రోజుల్లోనే మీలో తేడాని మీరే గమనిస్తారు.
జీవక్రియ లేదా మెటబాలిజం.. శరీరంలో జరిగే ఒక రసాయన ప్రక్రియ. శరీర బరువు తగ్గాలన్నా లేదా పెరగాలన్న ఇదే ముఖ్య కారణం. ఎందుకంటే ఇది శరీరంలోని కెలోరీలను వేగంగా తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ మిశ్రమం వలన జీవక్రియ మెరుగుపడటమే కాకుండా.. అన్ని విధాలు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.
మన జీర్ణవ్యవస్థ మన ఆరోగ్య స్థితిని తెలియజేస్తుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటాటానికి కావలసినంత ఆహారం తీసుకోవాలి. ఈ మిశ్రమం తాగటం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మరియు సరైన సమయంలో ఆహరం జీర్ణమై.. శరీరం అంతటా శక్తి రూపంలో వ్యాపిస్తుంది.
జీలకర్ర - సోంపు మిశ్రమం శరీరానికి ఒక డిటాక్స్ లాగా చేస్తుంది. ఉదయం లేవగానే ఈ సహజ సిద్దమైన జ్యూస్ తాగటం వలన శరీర బరువు తగ్గటమే కాకుండా.. జీవక్రియ మెరుగుపడుతుంది.