Agent Movie: ఎట్టకేలకు మోక్షం.. ఓటీటీలోకి రాబోతున్న ఏజెంట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

Agent Movie: అఖిల్ అక్కినేని 'ఏజెంట్' మూవీ ఓటీటీకి స్ట్రీమింగ్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన.. తాజాగా కొత్త డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే?  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 22, 2023, 04:32 PM IST
Agent Movie: ఎట్టకేలకు మోక్షం.. ఓటీటీలోకి రాబోతున్న  ఏజెంట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

Agent Movie on OTT: సాధారణంగా థియేటర్లలో రిలీజైన సినిమాలు నెల, రెండు నెలల్లోపు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కానీ 'ఏజెంట్‌' సినిమాకు మాత్రం ఐదు నెలల తర్వాత ఇప్పుడు మోక్షం కలిగింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను సోనిలివ్ సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే. గతంలోనే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించింది. అయితే కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల ఆ సినిమాను విడుదల చేయలేకపోయింది. మళ్లీ ఇప్పుడు కొత్త డేట్ ను ఎనౌన్స్ చేసింది. మరి ఈ సారైనా అనుకున్న టైంకి తీసుకువస్తారో లేదో చూడాలి. ఈ మూవీని సెప్టెంబరు 29న నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోని లివ్‌ సంస్థ ప్రకటించింది. దీంతో అఖిల్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

అఖిల్ అక్కినేని, సురేందర్‌ రెడ్డి కాంబోలో స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం ఏజెంట్. సుమారు రూ.80 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. నిర్మాతను, డిస్ట్రిబ్యూటర్‌లను తీవ్ర నష్టాలను మిగిల్చింది. కంటెంట్‌ ఉంటే చిన్న సినిమాలు సైతం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్నాయి. అలాంటిది ఇంత పెద్ద మెుత్తంలో ఖర్చు పెట్టిన సినిమా అంటే ఎలా ఉండాలి. బడ్జెట్ లో సగం ధరకే సినిమాను అమ్మేశారు. పోని ఆ మెుత్తమైన వచ్చిందంటే అదీ లేదు. అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రంలో మలయాళ నటుడు మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి తమిళ సంగీత దర్శకుడు హిప్‌ హాప్‌ సంగీతం అందించాడు. 

Also Read: Rocky Aur Rani ki Prem Kahani: ఓటీటీలోకి వచ్చేసిన ర‌ణ్‌వీర్ నయా మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News