Upper Back Pain Causes: వెన్నునొప్పి సమస్యల కారణంగా చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలు ఉన్నవారు చాలా వరకు లైట్ తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల చాలా మందిలో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వెన్నునొప్పి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. దీంతో పాటు జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది.
నడుము నిర్మాణంలో డిస్క్‌లు, కీళ్ళు, కండరాలు, స్నాయువులు మొదలైనవి ఉంటాయి. వీటిలో మార్పుల కారణంగా కూడా తీవ్ర వెన్ను నొప్పులు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. చాలా మందిలో ఆర్థరైటిస్ కారణంగా కూడా వెన్నునొప్పిలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వెన్ను నొప్పి వచ్చే ముందు శరీరంలో అనేక రకాల మార్పులు జరుగుతాయి. అంతేకాకుండా కొన్ని చిన్న చిన్న శరీర సమస్యలు కూడా వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.
వెన్నునొప్పి లక్షణాలు:
కండరాల ఒత్తిడి
కుట్టిన నొప్పి
అసూయగా అనిపిస్తుంది
ఆకస్మిక తీవ్రమైన నొప్పి
రెండు కాళ్ళ క్రింద నొప్పి
లేచినప్పుడు, నడుస్తున్నప్పుడు నొప్పి రావడం
Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్
వెన్నునొప్పికి కారణాలు ఇవే:
అతిగా బరువును మోయడం
ఎక్కువగా వండి బరువును లేపడం
గంటల తరబడి కూర్చోవడం
కండరాల నొప్పికి కారణంగా
ఒత్తిడి సమస్య రావడం కారణంగా
ఈ కారణాల వల్ల కూడా వెన్నునొప్పి రావచ్చు:
ఆర్థరైటిస్, క్యాన్సర్
మానసిక సమస్యల కారణంగా
ఊబకాయం సమస్యలు
కొలెస్ట్రాల్ పెరగడం
వ్యాయామాలు చేయలేకపోవడం
ధూమపానం
వెన్నునొప్పి ఉపశమనం పొందడానికి చిట్కాలు:
వెన్నునొప్పిలతో బాధపడేవారు తప్పకుండా ఉదయాన్నే నిద్రలేచి వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా యోగాసానాలు వేయడం వల్ల సులభంగా వెన్నునొప్పి ఉపశమనం లభించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఊబకాయం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఈ నొప్పితో బాధపడేవారు వంగి కూర్చోవడం మానుకోవాల్సి ఉంటుంది. నొప్పి తీవ్రతరం కాకుండా కేవలం ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook