UPI New Feature: ఆధునిక పోటీ ప్రపంచంలో ఇప్పుడు అంతా డిజిటలైజేషన్ అయిపోయింది. ఆన్లైన్ లావాదేవీలు పెరిగిపోయాయి. ముఖ్యంగా సెకన్లలో లావాదేవీలు జరిపే యూపీఐ చెల్లింపులపైనే అత్యధికంగా ఆధారపడుతున్నారు. అందుకే యూపీఐ చెల్లింపుల్లో కొత్త ఫీచర్లు వస్తున్నాయి.
ప్రస్తుతం ఎక్కడ చూసినా యూపీఐ చెల్లింపులే దర్శనమిస్తున్నాయి. యూపీఐ చెల్లింపులకు ఎంతగా అలవాటయ్యారంటే..అసలు నగదు క్యారీ చేయడమే తగ్గించేశారు. రూపాయి నుంచి ఎంతైనా సరే అంతా యూపీఐ లావాదేవీలే. యూపీఐ లావాదేవీల ఆదరణ పెరుగుతుండటంతో చాలా సంస్థలు ఈ సేవల్లో దిగుతున్నాయి. ఇప్పటికే మార్కెట్లో గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, అమెజాన్ పే, భారత్ పే ఇలా చాలా రకాల ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి.
ఇప్పుడు వీటిలో కొత్తగా 5 ఫీచర్లు జోడిస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. ఈ ప్రకటనను గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2023లో చేశారు. ఇప్పుడిక యూపీఐ చెల్లింపులు వాయిస్ కమాండ్ ఆదారంగా పనిచేస్తాయి. ఆశ్చర్యంగా ఉందా..నిజమే..ఒక్క వాయిస్ కమాండ్ ఇస్తే చాలు యూపీఐ చెల్లింపు పూర్తయిపోతుంది. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2023లో చాలా ఉత్పత్తులు లాంచ్ చేసింది ఎన్పీసీఐ. యూపీఐలో క్రెడిట్ లైన్, యూపీఐ లైట్ ఎక్స్, యూపీఐ ట్యాప్ అండ్ పే, హెల్లో యూపీఐ. ఆడియా కమాండ్‌ను స్వీకరించి చెల్లింపులు పూర్తి చేసే విధానమిది.
యూపీఐలో క్రెడిట్ లైన్
ఈ విధానంలో బ్యాంకుల్నించి కస్టమర్లకు ప్రీ శాంక్షన్ క్రెడిట్ సౌకర్యం లభిస్తుంది. ఈ విధానం డిజిటల్ బ్యాంకింగ్, ఈకో సిస్టమ్‌కు ఊతమిస్తుందంటున్నారు. ఆర్ధిక వృద్ధికి ఈ క్రెడిట్ లైన్ సౌకర్యం ఉపయోగపడుతుందనేది ఆర్బీఐ ఆలోచన.
యూపీఐ లైట్
యూపీఐ లైట్ ఎక్స్ఫీచర్ ద్వారా యూజర్లు ఆఫ్‌లైన్‌లో డబ్బులు పంపించడం, తీసుకోవడం చేయవచ్చు. ఎక్కడైనా నెట్వర్క్ కనెక్టివిటీ లేనప్పుడు లేదా మొబైల్లో డేటా లేనప్పుడు ఈ వెసులుబాటు అద్భుతంగా పనిచేస్తుంది. డిజిటల్ ఎకానమీకు ఈ విధానం అద్భుతంగా తోడ్పడుతుంది.
హెల్లో యూపీఐ..ఇది పూర్తిగా కొత్త విధానం. ఇక నుంచి యూపీఐ చెల్లింపులు చేయాలంటే నగదు ఎంటర్ చేసి, పిన్ కొట్టడం ఇదంతా అవసరం లేదు. యూపీఐ యాప్ ఓపెన్ చేసి వాయిస్ కమాండ్ ఇస్తే చాలు..క్షణాల్లో చెల్లింపు జరిగిపోతుంది.
Also read: SBI RD Interest Rates: ఎస్బీఐ ఆర్డీలో రూ.5 వేలు పెడితే.. రూ.55 వేలు లాభం.. ఎలాగంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook