ఇకపై మన దేశంలో స్వలింగ సంపర్కం నేరం కాబోదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. వివాదాస్పద ఐపీసీ సెక్షన్ 377పై కొద్దిసేపటి క్రితం సుప్రీం కోర్టు తుది తీర్పు వెల్లడించింది. ఇకపై భారత్లో స్వలింగ సంపర్కం చట్టరీత్యా నేరం కాదని ఈ సందర్భంగా సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. ఈమేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ చారిత్రాత్మక తీర్పుని వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న స్వలింగ సంపర్క ప్రేమికులు సంబరాలు జరుపుకుంటున్నారు. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తూ వస్తోన్న ఐపీసీ సెక్షన్ 377ని రద్దు చేయాలని కోరుతూ ఏళ్ల తరబడి సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం చేస్తోన్న వారికి ఈ తీర్పు ఆనందాన్ని ఇచ్చింది.